రామోజీ ఫిలిం సిటీ ఎన్నో అందాలకు పుట్టినిల్లు లాంటిది.. అలాంటి రామోజీ ఫిలిం సిటీ లో ఎన్నో సినిమాలు తెరకెక్కుతాయి కూడా..అలాంటి ఒక అద్భుతమైన అందమైన నిలయం లాంటి రామోజీ ఫిలిం సిటీపై బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రామోజీ ఫిలిం సిటీలో దయ్యాలు ఉంటాయని ఆమె మాట్లాడిన మాటలు మీడియాలో సంచలనం సృష్టించాయి. దీంతో రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాలి అనుకునే వారు చాలా మంది ఈ హీరోయిన్ చెప్పిన మాటలకు వణికిపోయారు. అయితే ఒక్క కాజోల్ అంటే ఏదో అలా అన్నదిలే అనుకోవచ్చు.కానీ కాజోల్ తో పాటు హీరోయిన్ రాశి ఖన్నా, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి,హీరోయిన్ తాప్సీ పన్ను వీళ్ళు కూడా రామోజీ ఫిలిం సిటీ లోని ఓ గదిలో దయ్యాలు ఉంటాయని,మేము ఆ హోటల్లో స్టే చేసినప్పుడు మాకు ఇలాంటి అనుభవం చాలాసార్లు ఎదురైందని చెప్పుకొచ్చారు.

తాప్సీ పన్ను అయితే దెయ్యాలు ఉంటాయని నేను నమ్ముతాను. కానీ మొదటిసారి దెయ్యాలతో సావాసం చేసినట్టు అనిపించిందని,నా రూమ్ లో ఎవరూ లేకపోయినా అడుగుల శబ్దాలు వినిపించాయని చెప్పింది.ఇక రాశి ఖన్నా మాత్రం నేను పడుకున్న బెడ్ అటు ఇటు కదలడమే కాకుండా నా దుప్పటి ఎవరో లాగేసినట్టు అయింది అంటూ చెప్పింది. ఇక ఎం ఎం కీరవాణి లేడీ సింగర్స్ పాటలు పాడుతున్న సమయంలో వారి చెవుల్లో భయంకరమైన శబ్దాలు వినిపించాయని ఇలా ఎవరికి ఎదురైన అనుభవం వాళ్లు చెప్పుకున్నారు. అయితే కాజోల్ రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు ఉంటాయని చెప్పడంతో వీళ్ళు గత ఇంటర్వ్యూలలో మాట్లాడిన వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో రామోజీ ఫిలిం సిటీ దెయ్యాలకు నిలయం అన్నట్లుగా మాట్లాడుకున్నారు. అయితే సడన్గా మాట మార్చింది హీరోయిన్ కాజోల్.

 రామోజీ ఫిలిం సిటీ లో దయ్యాలు ఉంటాయని నేను అన్నది అంతా తూచ్ అని, అసలు అక్కడ దెయ్యాలే ఉండయని, నేను నా సినిమా ప్రమోషన్స్ కోసం అలాంటి మాటలు మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చింది.అంతేకాదు నేను చాలాసార్లు రామోజీ ఫిలిం సిటీ లో సినిమాల కోసం వెళ్లాలని ఎంతోమంది పర్యాటకులు రామోజీ ఫిలిం సిటీకి వచ్చి అందమైన అనుభూతులను పొందుతారు. కానీ నేను నా కొత్త సినిమా 'మా' ని ప్రమోట్ చేసుకోవడం కోసం అక్కడ దెయ్యాలు ఉన్నాయని ఊరికే చెప్పాను. అక్కడ ఎలాంటి దెయ్యాలు లేవు. చాలాసార్లు నేను సినిమా షూటింగ్ ల కోసం రామోజీ ఫిలిం సిటీ కి వెళ్లాను. సినిమాలకు అది అద్భుత నిలయం అంటూ చెప్పుకొచ్చింది. అయితే కాజోల్ నటిస్తున్న 'మా' అనే మైథాలజికల్ హార్రర్ మూవీ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: