యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ఆయన తల్లి శాలిని గారిపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెర లేపిన సంగతి తెలిసిందే. `వార్ 2` రిలీజ్ రోజు ఎన్టీఆర్ ను బూతులు తిడుతున్న దగ్గుపాటి ఆడియో లీక్‌ కావడంతో తారక్‌ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా ఎన్టీఆర్‌కు, ఆయన తల్లికి క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో పార్టీ నుంచి ఆయ‌న్ను సస్పెండ్ చేయాలంటూ తారక్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.


అయితే అటు దగ్గుబాటి నుంచి కానీ, ఇటు పార్టీ నుంచి కానీ స్పందన లేకపోవడంతో ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించేందుకు యత్నించారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను చెదరగొట్టారు. ఇంత జ‌రుగుతున్నా ఈ అంశంపై నంద‌మూరి, నారా కుటుంబ‌స‌భ్యులు స్పందించ‌లేదు.


కానీ తాజాగా నారా రోహిత్ రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న అప్ క‌మింగ్ ఫిల్మ్ `సుందరకాండ` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు. ఆగ‌స్టు 27న ఈ చిత్రం విడుద‌ల కాబోతుంది. అయితే ఎన్టీఆర్‌ను ఎమ్మెల్యే బూతులు తిట్ట‌డంపై ఓ మీడియా స‌మాశంలో నారా రోహిత్ ను రిపోర్ట్స్ ప్ర‌శ్నించారు. అందుకు ఆయ‌న రియాక్ట్ అవుతూ.. `ఆ ఆడియో గురించి ఎక్కడో చదివాను, కానీ వినలేదు. ఈ అంశం గురించి నాకు పూర్తి సమాచారం తెలియ‌దు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లతో ఉన్నాను. పూర్తి వివరాలు తెలియకుండా ఏదైనా మాట్లాడటం సరైంది కాదు` అంటూ స‌మాధానం ఇచ్చారు. ప్ర‌స్తుతం నారా రోహిత్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: