'ఓ స్థిరాస్తి విక్రయంలో అధికారులు చుక్కలు చూపించారు. అధికారులు రెండేళ్ల పాటు ఇబ్బంది పెట్టారు. ముఖ్యమంత్రికి చెప్పినా స్థానిక అధికారులతో ఇబ్బంది తప్ప లేదు'... ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు అధికార పార్టీ ఎం.ఎల్.ఏ. ఇంతకీ ఎవరా శాసన సభ్యుడు ? తెలుసుకోవాలని ఉందా ?


 మరో రెండు సంవత్సరాలలో శాసన సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారపార్టీ శాసన సభ్యులు ఇప్పటి నుంచే ఏదో ఒక కార్యక్రమం పేరిట ప్రజలతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక్కో ఎం.ఎల్.ఏ ఒక్కో విధంగా ప్రజల్లోకి వెళుతున్నారు. కొందరు  బారసాల కార్యక్రమలు మొదలు కొని పెండ్లిళ్ల వరకూ క్రమం తప్పకుండా అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మరి కొందరు అధికార పార్టీ నేతలు సొంతగా యూట్యూబ్ ఛానళ్లను ఏర్పాటు చేసుకుని, స్వీయ ప్రచారం చేసుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుగా పేరుపొందిన నెల్లూరు జిల్లా  కావలి శాసన సభ్యుడు రామిరెడ్డి ప్రతాప్  కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమాలలో డయల్ యువర్ ఎం.ఎల్.ఏ కూడా ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఆయన నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకుని సమస్యల పరిష్కరిస్తుంటారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నది కూడా. అయితే ఆయన తాజాగా నిర్వహించిన డయల్ యువర్ ఎం.ఎల్. ఏ కార్యక్రమంలో  తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. అది కాస్తా జిల్లాలో  చర్చనీయాంశమైంది..
కావలి పట్టణంలోని ఓ వ్యక్తి ఎం.ఎల్.ఏకి ఫోన్ చేసి తన గోడు వెళ్లగక్కారు. కావలి జనతా పేట లోని తన భూమిని విక్రయించాలంటే వీలు పడటం లేదని , భూ రికార్డుల్లో చుక్కలు ఉండటం మూలంగా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. దీనికి ఎం.ఎల్.ఏ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెెడ్డి సమాధానం ఇచ్చే బదులు, తాను పడిన అవస్తలను ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. తన అంతరంగాన్నిఆవిష్కరించారు. శాసన సభ్యుడైన తనకే ఇబ్బందులు తప్పలేదని వాపోయారు.  రెండు సంవత్సరాల పై చిలుకు కాలం రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ విషయాన్ని తాను ఏకంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్ల తెలిపారు. స్థానికంగా పాతుకుపొయిన అధికారులతో ఇబ్బందులు తప్పడం లేదని చెప్పారు. కొసమెరుపేమిటంటే... ఇదంతా గత ప్రభుత్వ హయాం నుంచి వచ్చిన ఇబ్బందులేని తన మాటలకు ఎం.ఎల్.ఏ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కోనడం.


మరింత సమాచారం తెలుసుకోండి: