క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బహిరంగసభలో మాట్లాడినా, కార్యక్రమం ఏదైనా సరే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ గురించి, ఎల్లోమీడియా గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఎక్కడైనా సరే జగన్ అర్ధగంటసేపు జగన్ మాట్లాడితే అందులో కనీసం 10 నిముషాలు చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా గురించే ఉంటోంది.





ఎలాగూ వీళ్ళందరినీ కలిపి దుష్టచతుష్టయమని అన్నారు కాబట్టి మంత్రులు, ఎంఎల్ఏలు కూడా అదేబాటలో నడుస్తున్నారు. పదే పదే దుష్టచతుష్టయం గురించి ప్రస్తావిస్తున్నారు. ఏలూరు జిల్లాలోని గణపవరంలో జరిగిన బహిరంగసభలో కూడా ముందు వైఎస్సార్ రైతుభరోసా గురించి మాట్లాడారు. రైతులకు తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని గురించి, అమలుచేస్తున్న పథకాల గురించి చెప్పారు. తమ రెండు ప్రభుత్వాల మధ్య తేడాను గమనించాలని కోరటం కూడా కరెక్టే. 





తమ ప్రభుత్వంగురించి చెప్పుకోవటం వరకు ఓకేనే. కానీ అక్కడితో ఆగకుండా చంద్రబాబు, పవన్, దుష్టచతుష్టయం గురించి ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు పాలన గురించి జగన్ కొత్తగా జనాలకు గుర్తుచేయాల్సిన అవసరంలేదు. ఎందుకంటే 2014-19 మధ్య చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా జరిగిందో జనాలకు అనుభవంలో ఉందికాబట్టే తర్వాత ఎన్నికల్లో వైసీపీకి అంతటి అఖండ మెజారిటిని ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జగన్ పరిపాలనపై చంద్రబాబు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు.





ఇదే సమయంలో చంద్రబాబు గురించి ప్రస్తావించాల్సిన అవసరం జగన్ కు ఏముంది ? తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు, ప్రభుత్వ విధానాల గురించి మాత్రమే జగన్ చెప్పుకుంటే సరిపోతుంది. కానీ అంతటి ఆగకుండా ప్రత్యర్ధుల గురించి మాట్లాడుతున్నారంటే చంద్రబాబు ట్రాపులో జగన్ పడినట్లే ఉంది. చంద్రబాబు గురించి మాట్లాడేట్లుగా ఎల్లోమీడియా రోజుకో వార్తను, కథనాన్ని అచ్చేసి జగన్ను రెచ్చగొడుతోంది.  జగన్ రెచ్చిపోయి చంద్రబాబు, ఎల్లోమీడియా గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతోనే చంద్రబాబు, ఎల్లోమీడియా ట్రాపులో జగన్ పడిపోయినట్లు అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: