నో అపాయింట్ మెంట్ అన్న అమిత్ షా ?

 ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్ర బాబు నాయుడుకు కేంద్ర హోం మంత్రి  అమిష్ షా  అపాయింట్ మెంటి  ఇంత వరకూ ఖరారు కాలేదు.  వరుస వెంబడి కేంద్ర క్యాబినెట్ సమావేశాలు జరుగుతుండటం ప్రధాన కారణంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  అసలు కారణాలు వేరే ఉన్నాయన్నది సుస్పష్టం. తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రం తమ అధినేత శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలుస్తారని పేర్కోంటున్నారు. కేంద్ర హోం శాఖ వర్గాలు మాత్రం చంద్ర బాబుకు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు ఖరారైన ప్రకటన ఏదీ చేయలేదు.

అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు సఖ్యత లేదు. ఆయన ఆ సమయంలో వామపక్షాలతో కలసి మెలసి తిరిగారు. ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాక ఎన్నిక సమయంలో భారతీయ జనతా పార్టీతో పొట్టు పెట్టుకున్నారు. కాలానుగుణంగా, క్రమంగా ఆ పార్టీకి ఆయన దూరమయ్యారు. అంతటితో ఆగలేదు. ప్రత్యేక హోదా సాకుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విరుచుపడ్డారు. కాంగ్రెస్ తో నూ చేతులు కలిపారు. ఆ పార్టీ  సీనియర్ నేతలకు తమ పార్టీ తరపును ఎన్ని కల్లో పోటీ చేయిచారు.  సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ లు కలసి పోటీ చేశాయి. ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఘోర అవమానం జరిగింది. దీంతో ఆ తరువాత వచ్చిన  సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్  పార్టీతో నేరుగా పొత్తు పెట్టుకోక పోయినా టిడిపి నుంచి  సీనియర్ కాంగ్రెస్ నేతలకు నేరుగా టికెట్లు ఇచ్చారు.  మాజీ కేంద్ర మంత్రులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పనబాక లక్షి తో పాటీ కిశోర్ చంద్ర దేవ్ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు టిటిడి పార్టీ తరపున పోటీ చేసి  పరాజయం పాలయ్యారు.

గతంలో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు తరఫున లాబీయింగ్ చేసిన నేతలు ఎవ్వరూ ఆయనకు  ప్రస్తుతం అందుబాటులో లేరు. చంద్ర బాబు ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలోఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతినిధిగా ఉన్న కంభం పాటి రామ్మోహన్ రావు ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.  చంద్ర బాబు నాయుడుకు అన్నీ తానే అయి సర్వస్వం ధార బోసి, అర్థ అంగ బలాలను మొహరించిన గరికపాటి మోహాన్ రావు క్రమంగా బీజేపిలో చేరారు. ఆయన సేవలకు బి.జె.పి గుర్తించింది కూడా. ప్రస్తుతం ఆయన బి.జె.పి జాతీయ కార్యవర్గ సభ్యుడుగా ఉన్నారు. ఇక పోతే చంద్ర బాబు మనుషులుగా ఢిల్లీ లోలాబీయింగ్ చేసిన సి.ఎం. రమేష్, సుజనా చౌదరి తదితరులు కూడా భారతీయ జనతా   పార్టీలో చేరారు.
తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర నాథ్ లు ఢిల్లీలో లాబీయింగ్ చేసే స్థితిలో లేరు, ఇక గల్లా జయదేవ్  సొంత వ్యాపారాలు చూసుకుంటూ అడపాదడపా టిడిపి కార్యక్రమాలకు హాజరవుతున్నారు.  ఇక విజయవాడ ఎం.పి కేశినేని పరిస్థితి తెలిపిందే.  ఢిల్లీ లోని ఆయన కార్యాలయంలో చంద్రబాబు ఫోటోలను పీకి పక్కన పారేసిన ఉదంతం ఇంకా జనం మర్చి పోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: