పరీక్షలు విద్యార్థుల ఫెయిల్‌  సతం ఎక్కువగా ఉన్న7 రాష్ట్రాలు .  పదో తరగతి , ఇంటర్మీడియట్ తరగతులకు కామన్ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర విద్యా శాఖ సూచిస్తుంది .  అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణతో సహా అస్సాం , కేరళ ,మణిపూర్ ,ఒడిశా ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి .. ఈ ఏడు రాష్ట్రాల్లో గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు 60 శాతంగా ఉన్నారని కేంద్ర విద్యా శాఖ తెలిపింది .. ప్రధానంగా 10 , 12 తరగతులకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు అందుకోవచ్చని కేంద్ర విద్యా శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ సిఫార్సు చేస్తున్నారు ..


అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 66 పాఠశాల పరీక్ష బోర్డులు ఉన్నాయి .. వాటిలో జాతీయస్థాయిలో మూడు , రాష్ట్రస్థాయిలో 63 (అలాగే 54 రెగ్యులర్, 12 ఓపెన్ బోర్డులు) కూడా ఉన్నాయి .. ఇక వీటిలో టాప్ 33 బోర్డుల్లో 97% విద్యార్థులను కవర్ చేస్తున్నప్పటికీ .. మిగిలిన 33 బొడ్డులు కేవలం మూడు శాతం మందికి మాత్రమే అందుబాటులోకి వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి .. అయితే ఇది విద్యార్థుల విషయంలో ఆందోళన కలిగించే విషయమని కేంద్రం అభిప్రాయపడుతుంది .. ప్రధానంగా 10 , 12 తరగతి లకు ఏకీకృత  బోర్డులు ఏర్పాటు చేయటం కారణంగా పాఠశాలల పనితీరు పలితాలు మెరుగుపడతాయని .. అలాగే అధిక ప్రామాణీకరణ లేకపోవటం కారణంగా విద్యార్థుల పనితీరులో పలు అసమానతలు వస్తాయని విద్యా శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ అంటున్నారు ..



అలాగే 2024లో  22.17 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యారు .. అలాగే 20 .16 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతిలో ఫెయిలయ్యారు .. ఈ గణాంకాలు గత సంవత్సరాల కంటే మెరుగుదలను చూపిస్తున్నప్పటికీ , ఉన్నత విద్యకు మెరిగ్గా మారటం , డ్రాపౌట్ రేట్లను తగ్గించడంలో ఇవి గణనీయమైన అడ్డంకిగా మారుతున్నాయని అంటున్నారు .. ఇదే క్రమంలో ఓపెన్ స్కూల్ బోర్డులు మరింత దారుణంగా ఉన్నాయి .. పదో తరగతి విద్యార్థుల్లో 54% మంది , 12వ తరగతి విద్యార్థుల్లో 57 శాతం మంది మాత్రమే ఇందులో పాస్ అవుతున్నారని చెబుతున్నారు .. ముఖ్యంగా అధిక ఫెయిల్యూర్ రేట్లు ఉన్న రాష్ట్రాల్లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) తన పరిధిని మరింత విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందని చెబుతున్నారు .. ప్రస్తుతం దేశంలో NIOS ఢిల్లీ , రాజస్థాన్ , హర్యానా రాష్ట్రాల్లో బలమైన విద్యా విధానం ఉంది .. అలాగే ఈ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థుల ఫెయిల్యూర్ రేట్లు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: