- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .

పుట్టా సుధాకర్ యాదవ్ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. య‌నమల రామకృష్ణుడికి వియ్యంకుడిగా గుర్తింపు పొందిన సుధాకర్ యాదవ్ ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేసి ఎట్టకేలకు గత ఎన్నికలలో గెలుపు గుర్రం ఎక్కారు. 2014 - 2019 ఎన్నికలలో సుధాకర్ యాదవ్ పోటీ చేసినా ఆయన ఓడిపోయారు. గత ఎన్నికలలో మాత్రం తొలిసారి విజయం దక్కించుకున్నారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అనుషంగా టిటిడి చైర్మన్ పదవి సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోని 2019 ఎన్నికలలో ఓడిపోయారు. గత ఎన్నికలలో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుధాకర్ యాదవ్ ప్రజలకు చేరువయ్యారా ? అనే విషయాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం నిర్వహించిన రెండు మూడు సర్వేలలో ఒక దాంట్లో రెడ్ జోన్లో ఉండగా ... మరో దాంట్లో ఆరంజ్ జోన్ లో ఉన్నారు. ఏ సర్వేలోను ఆయన గ్రీన్ జోన్ లో కనిపించలేదు. ప్రజల్లో పొట్ట పట్ల పెద్ద సానుకూలత అయితే కనిపించడం లేదని స్పష్టం అవుతుంది. రాజకీయంగా ఆయనకు మద్దతు ఉన్నా .. పార్టీ పరంగా మంచి సానుకూల వాతావరణం ఉన్న ప్రజలలో ఆయన ఇంకా దూసుకు పోవాల్సిన అవసరం ఉందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది మాత్రమే అవుతుంది. మరో నాలుగేళ్ల సమయం ఉండడంతో ఆయన పుంజుకునేందుకు ఇది మంచి అవకాశం గా చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: