
కేటీఆర్ కు సపోర్ట్:
కవిత తన అన్న అయినటువంటి కేటీఆర్ కు ఎంతో సపోర్ట్ చేస్తోంది. కానీ హరీష్ రావును సంతోష్ రావును నిందిస్తోంది. ఇద్దరు నాయకుల వల్లే నేను లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నానని చెప్పకనే చెప్పింది. ఈ ఇద్దరు కలిసి కేసీఆర్ ని కూడా పూర్తిగా ముంచేయాలని ఆయనపై అవినీతి మరక పడేలా చేశారని చెప్పుకొచ్చింది. కేసీఆర్ తిండి తిప్పలు లేకున్నా ప్రజల కోసం ఆలోచించే మనిషి అని అలాంటి నాయకుడిని ఈ విధంగా చేయడం వీళ్ళకే చెందిందని తెలియజేసింది. దీన్నిబట్టి చూస్తే కేసీఆర్ కు హరీష్ రావును సంతోష్ రావును దూరం చేయాలనే ప్లాన్ కవిత చేసిందని తెలుస్తోంది.
కవిత మాటలు కేసీఆర్ ప్లానా:
కవిత కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం వెనక, బీజేపీ, కాంగ్రెస్ ఉందని హరీష్ రావు అంటున్నారు. కానీ దీనిపై కవిత క్లారిటీ ఇచ్చింది. నేను కేసీఆర్ బిడ్డను అని..ఎవరో చెబితే మాట్లాడే వ్యక్తిని కాదని చెప్పుకొచ్చింది. అయితే ఇంత వ్యవహారం నడుస్తున్న కేసీఆర్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. కనీసం బిడ్డను పల్లెత్తు మాట అనలేదు. దీన్ని బట్టి చూస్తే ఆయనకు కూడా హరీష్ రావు, సంతోష్ రావుపై కాస్త అనుమానమే ఉన్నట్టు కనబడుతోంది. అందుకే బిడ్డకు సపోర్ట్ చేస్తున్నారని, ఆమె బీఆర్ఎస్ పార్టీని రోడ్డుపై పెట్టినా కానీ కనీసం రియాక్ట్ అవ్వడం లేదని అంటున్నారు.. దీన్ని బట్టి చూస్తే రాబోవు రోజుల్లో బిఆర్ఎస్ కు భవిష్యత్తు ఉండదని కవిత రూపంలో మళ్లీ ఒక పార్టీని తీసుకురావాలని కేసీఆర్ ప్లాన్ వేశారా.. ఆ ప్లాన్ లోనే కవిత నడుస్తుందా.. అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 10 సంవత్సరాల పాటు ఎదురులేకుండా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం రోడ్డుమీదికి వస్తున్నారని ఈ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది.