దుబాయ్, ఓమ‌న్ అబుదాబి వేదిక‌గా టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే టీమిండియా త‌న మొద‌టి మ్యాచ్ ను ఆడేసింది. ఈ మొద‌టి మ్యాచ్ లో ద‌యాది దేశ మైన పాకిస్థాన్ పై ఓట‌మి పాల‌యింది. అలాగే త‌న త‌ర్వాతి మ్యాచ్ ఈ నెల 31 న న్యూజీలాండ్ తో జ‌ర‌గ‌బోతుంది. అయితే టీమిండియా ప్ర‌స్తుతం దుబాయ్ లోని ది పామ్ అనే హోట‌ల్ లో ఉంటుంది. అలాగే దుబాయ్ లోనే ఉన్న స్టేడియంలో ప్రాక్టిస్ చేసుకుంటుంది. అయితే న్యూజీలాండ్ తో మ్యాచ్ ఉన్న రెండు రోజుల ముందు టీమిండియా ప్రాక్టిస్ ను దూరం పెట్టి దుబాయ్ బీచ్ ల‌పై వాలీ బాల్ ఆడుతూ క‌నిపించింది. మ్యాచ్ కు ముందు టీమిండియా ప్రాక్టీస్ కు డుమ్మ కొట్ట‌డం పై ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పించారు.



దీని పై బీసీసీఐ వివ‌ర‌ణ ఇచ్చింది. అలాగే త‌మ కు జ‌రిగిన విష‌యాన్ని ఐసీసీ కి తెలిపి ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు దుబాయ్ లోనే ఉన్న టీమిండియా కు దుబాయ్ లో ఉన్న స్టేడియంలో నే ప్రాక్టిస్ చేసు కోవ‌డానికి అనుమ‌తి ఇచ్చారు. కానీ రెండు రోజుల క్రితం టీమిండియా ప్రాక్టిస్ ను దుబాయ్ నుంచి అబుదాబి కి మార్చారు. అయితే దుబాయ్ నుంచి అబుదాబి కి చేరు కోవ‌డానికి దాదాపు నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. దీంతో ఆ రోజు ప్రాక్టిస్ కు డ‌మ్మ కొట్టి బిచ్ లో నే వాలీబాల్ ఆడారు.  అయితే త‌మ ప్రాక్టిస్ ను స‌డన్ గా అబుదాబి కి మార్చ‌డం పై బీసీసీఐ ఐసీసీ కి ఫిర్యాదు చేసింది. అయితే వాలీ బాల్ ఆడ‌టం ద్వారా కూడా ఫిట్ నెస్ ను సొంతం చేసు కోవ‌చ్చు అని ప‌లువురు టీమిండియా అభిమానులు అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: