ఐపీఎల్ సీజన్ 15 లో బాగంగా నిన్న రాత్రి ముంబై లోని డివై పాటిల్ స్టేడియం లో బెంగళూర్ మరియు కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. రెండవ విజయమే లక్ష్యంగా కోల్కతా మరియు లీగ్ లో మొదటి గెలుపు రుచి చూడాలని బెంగళూర్ లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన బెంగళూర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ సేన మొదటి నుండి తడబడుతూ ఆడింది. వరుస వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో రస్సెల్ మరియు ఉమేష్ యాదవ్ లు మోస్తరుగా ఆడటంతో 128 పరుగులు అయినా చేయగలిగింది. అద్భుతమైన బౌలింగ్ తో కోల్కతా ను శ్రీలంక స్పిన్నర్ హసరంగ దెబ్బ తీశారు. తన కోటా 4 ఓవర్ లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు, ఇతనికి ఆకాష్ దీప్ (3 వికెట్లు) నుండి చక్కని సహకారం లభించింది.

అయితే స్కోర్ బోర్డ్ పై ఈ స్కోర్ చూడగానే బెంగళూర్ కు విజయం నల్లేరు పై నడకే అనుకున్నారు. కానీ విజయం కోసం డుప్లిసిస్ సేన చెమటోడ్చాల్సి వచ్చింది. లక్ష్య చేదనలో బెంగళూర్ కూడా తడబడింది. పవర్ ప్లే లో 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అల్ రౌండర్ విల్లీ మరియు రూథర్ ఫర్డ్ లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే మళ్లీ వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టి కోల్కతా మ్యాచ్ లోకి వచ్చింది. అలా మ్యాచ్ ఆఖరి ఓవర్ లో 7 పరుగులు చేస్తే విజయం దక్కుతుంది. ఈ టైం లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రస్సెల్ చేతికి బంతిని అందించాడు. రస్సెల్ సైతం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ మొదటి బంతిని మిడిల్ పిచ్ లో వేయడంతో, హిట్టర్ అయిన దినేష్ కార్తీక్ దాన్ని మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ గా మలిచాడు. దీనితో మ్యాచ్ టై అయింది.

ఆ తర్వాత బంతిని చక్కని స్ట్రెయిట్ డ్రైవ్ ద్వారా బౌండరీకి తరలించి బెంగళూర్ ను విజయ తీరానికి చేర్చాడు. దీనితో 3 వికెట్ల తేడాతో కోల్కతా పై విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆఖరి వరకు విజయం ఇరు జట్ల మధ్యన దోబూచులాడింది. ప్రస్తుతం బెంగుళూరు సైతం లీగ్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: