
క్రికెట్ ఎలా అయితే గల్లి ఆటగా పిలుచుకుంటారో అటు వాలీబాల్ ని కూడా గల్లీ గేమ్ అంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది యువకులు వాలీబాల్‌లో సత్తా చాటుతూ రాష్ట్రస్థాయి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలే వాలిబాల్ పోటీలలో అటు టీమిండియా సత్తా చాటింది. ఆసియా అండర్ 18 పురుషుల వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 25–19, 25–14, 25–27, 25–23తో మాజీ చాంపియన్ తైనీస్ తైపీపై విజయఢంకా మోగించింది. ఈ టోర్నీలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది టీమిండియా. ఖుష్ సింగ్ 22 పాయింట్లు సాధించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం అండర్ 18 పోటీలలో సెమీఫైనల్ చేయడం కారణంగా భారత జట్టు వచ్చే ఏడాది జరగబోయే అండర్ 19 ప్రపంచ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించినట్లు అయింది అని చెప్పాలి. కాగా సెమీఫైనల్లో భాగంగా ఆతిథ్య శ్రీలంక జట్టుతో భారత జట్టు తలపడనుంది.