
ఏకంగా మంచేస్టర్ యునైటెడ్ క్లబ్ తో క్రిస్టియానో రోనాల్డో తెగదెంపులు చేసుకుని ఇక అన్ని బంధాలను తెంచుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంచెస్టర్ క్లబ్ తో పాటు ఆ జట్టు మేనేజర్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. జట్టు మేనేజర్ తనకు అన్యాయం చేశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే మంచేస్టర్ యునైటెడ్ క్లబ్ తో బంధం తెంచుకున్న రోనాల్డో ను ఇక తమ తో అంటిపెట్టుకునేందుకు ప్రస్తుతం ఎన్నో ఫుడ్ బాల్ క్లబ్లు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
ఈ క్రమం లోనే రోనాల్డో లోకి సౌదీ అరేబియా కు చెందిన ఫుట్బాల్ క్లబ్ ఆల్ నజర్ బంపర్ ఆఫర్ ఇచ్చింది అన్నది తెలుస్తూ ఉంది. ఏకంగా మూడేళ్లకు గాను 225 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. అంటే భారత కరెన్సీ ప్రకారం 1840 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. అంటే ఏడాదికి 75 మిలియన్ డాలర్లు.. భారత కరెన్సీ ప్రకారం 612 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధం అవ్వడం గమనార్హం. ఇక అటు క్రిస్టియానో రోనాల్డో కూడా అల్ నజర్ క్లబ్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.