
అప్పటి వరకు కష్టాల కడలిలో కెరీర్ ని కొనసాగించిన ఆటగాళ్లకు ఇక ఐపీఎల్ ఆర్థిక భరోసాని ఇస్తుంది. అంతే కాదు ప్రతిభను నిరూపించుకొని జాతీయ జట్టు లోకి వెళ్లేందుకు ఒక బంగారు బాటను వేస్తుంది అని చెప్పాలి. అంతే కాదండోయ్ ఇక అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్న ఎంతో మంది ప్లేయర్ల లో దాగి ఉన్న నాయకత్వ ప్రతిభను వెలిక్కి తీయడం లో కూడా ఐపీఎల్ ఉపయోగపడుతుంది. ఐపీఎల్ కారణం గానే ఇక అటు భారత జట్టుకు ఫ్యూచర్ కెప్టెన్లు వెలుగు లోకి వస్తున్నారు అని చెప్పాలి.
ఇదే విషయం పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభావంతులైన ఆటగాళ్లని మాత్రమే కాకుండా వారిలో దాగి ఉన్న నాయకత్వ ప్రతిభను వెలికి తీసే అద్భుతమైన టోర్నీ ఐపీఎల్ అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో అద్భుతం గా రానించి గుజరాత్ జట్టును టైటిల్ విజేతగా నిలపడం వల్లే హార్దిక్ పాండ్యాకు టీమిండియా కెప్టెన్సీ వాహించే ఛాన్స్ వచ్చింది అంటూ అభిప్రాయపడ్డాడు. అయితే టీమిండియా టి20 జట్టును మాత్రం ఐపీఎల్ ఆట తీరును బట్టి సెలెక్ట్ చేయకూడదని ఓవరాల్ పెర్ఫార్మన్స్ ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేయాలి అంటూ సూచించాడు సౌరబ్ గంగూలీ.