2023 ఐపీఎల్ సీజన్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక రేపే ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. దీంతో 2023 ఐపీఎల్ సీజన్ టైటిల్ విజేత ఎవరు అన్న ఉత్కంఠకు రేపు తెరపడబోతుంది అన్న విషయం తెలిసిందే. . అయితే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడిపోయిన గుజరాత్ జట్టు ఇటీవల  ముంబైతో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో మాత్రం విజయం సాధించి సత్తా చాటింది.



 ఈ క్రమంలోనే ఫైనల్ లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ తో మరోసారి టైటిల్ కోసం పోరును కొనసాగించే ఛాన్సను దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్. అయితే గుజరాత్ టైటాన్స్ ఇక ఫైనల్ పోరుకు ఎంతో విజయవంతంగా దూసుకు వచ్చింది అంటే అందుకు కారణం ఇక ఆ జట్టు ఓపెనర్ శుభమన్ గిల్ అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ 16వ సీజన్లో అతను అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తున్నాడు. నాకౌట్ మ్యాచ్లలో అయితే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇక అతని మెరుపు బ్యాటింగ్ గుజరాత్ జట్టు విజయానికి కారణం అవుతుంది.


 ఇటీవల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 49 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు శుభమన్ గిల్. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఐపిఎల్ హిస్టరీలో ఒక సీజన్లో అత్యధిక రన్స్ చేసిన రెండో ఇండియన్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు శుభమన్ గిల్. 2016లో కోహ్లీ 973 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బట్లర్ 863 రన్స్ తో తర్వాత స్థానంలో ఉన్నాడు. అయితే గిల్ 851 పరుగులు చేయగా ఇందులో మూడు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇలా కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా రికార్డు సృష్టించాడు గిల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl