బార్బర్లకు నెలకు ఐదు వేలు ...ఎక్కడో తెలుసా ?

భారతీయ హిందూ దేవాలయాలకు, క్షురకులకు అవినాభావ సంబంధం ఉంది. ఇది ఈ నాటిది కాదు సంత్సరాల తరబడి ఈ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. దేవుడు దేవాలయం నుంచి వెలుపలికి వచ్చే ముందు కూడా మేళం వాయించడం హైందవ సంప్రదాయం లో ఒక భాగం. దేవుడి ఉత్సవానికి ముందు నడుస్తూ మేళం వాయిస్తారు క్షురకులు. ఇది నగరాలలోను, పట్టణాల లోనూ, చిన్న గ్రామాలలోను తరతరాలుగా జరుగుతున్న ఆచార వ్యవహారం. అయితే గ్రామాలలోని దేవాలయాలకు వచ్చే ఆదాయం తక్కువ. భక్కుల నుంచి వచ్చే కానుకలు కూడా తక్కువే. ఆ దేవుడ్ని నమ్ముకుని జీవనం సాగించే క్షురకులకు నేటి రోజుల్లో పూట గడవడం కూడా కష్టతరంగా మారింది. దేవాలాయల్లో మొక్కులు గా తలనీలాలు సమర్పిస్తారు. తలనీలాలు తీసేది కూడా క్షురకులే. అయితే అక్కడ వారికి వచ్చే నగదు చాలా చాలా స్వల్పం. తమను ఆదుకోవాలని క్షురకులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరి గోడు ఇలా ఉంటే తలనీలాలు సమర్పించేందుకు వస్తున్న భక్తులు వసూళ్లను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు సమస్యలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గుర్తించారు. పాలనా పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో అడుగు ముందుకు వేశారు. ఏళ్ల తరబడి పస్తులతో కాలం గడుపుతున్న క్షురకులకు నేలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం అందజేసే దిశగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దేవాలయాల్లో మేళం వాయించే క్షురకులు, తలనీలాలు సమర్పించే స్థలం లో పని చేసే క్షురకులకు  ఈ గౌరవ వేతనం అందనుంది.  తమిళనాడు రాష్ట్రంలోని దేవాలయాల్లో 1,744 మంది క్షురకులు ఉన్నారు. వీరందరికీ ఈ గౌరవ వేతనం లభించ నుంది.  తాజా ఉత్తర్వుల వల్ల  తమిళనాడా ఖజానాకు  పదకొండు కోట్ల రూపాయల వరకూ భారం పడనుందని ముఖ్యమంత్రి పేషీలోని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7 వ తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి శేఖర్ బాబు ఈ విషయం పై ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. కేవలం నెల రోజుల లోపలే ఈ కార్యక్రమం అమలుకు నోచుకుంది. దేవాలయాల్లో పని చేసే క్షురకులకు ఇది నిజంగా శుభ వార్తే. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టాలిన్ ను అనుసరిస్తారా ?

-----






























































































































































































































మరింత సమాచారం తెలుసుకోండి: