ప్రధానంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి, స్త్రీలకు  ఎక్కువగా అనారోగ్యం రావడం, ఇంట్లోకి వచ్చేటువంటి ధనం ఏదైతే ఉంటుందో దానికి నిలకడగా ఉండకపోవడం  వంటి విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. అయితే తప్పకుండా ఈ పరిహారం పాటించాల్సిందే..! మనకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే దిక్కులు ఉంటాయి. ఇందులో కొన్ని దిక్కులు కొన్ని ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. ఆ అంశాలు ఇక్కడ మొదటగా ఆడవారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వారికి ఉత్పన్నమవుతున్న సంసార సమస్యలు కావచ్చు.

వాటీ గురించి విశ్లేషణ తెలుసుకునే ముందు వారి ఇళ్లలో ప్రధానంగా స్త్రీలకు  ఉత్తరము, ఆగ్నేయం, నైరుతి, దిక్కులో సమస్యలు ఎదురవుతాయి. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆగ్నేయం దిక్కు. మనం ఈ దిక్కులో ఎక్కువగా ఆహారం తయారు చేస్తాం. ఈ దిక్కులో ఎప్పుడైనా సరే పొయ్యిని  పెట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి తూర్పు గోడకు తగిలించి పెట్టరాదు. ఆ పొయ్యి ఆ గోడకు తాగకుండా కనీసం నాలుగు నుంచి ఐదు అంగుళాల దూరం జరిపి దానిని దక్షిణ గోడకు  తగిలించి పెట్టాలి. దాని కింద వంటగది యొక్క ప్లాట్ ఫారం ఏదైతే ఉందో అక్కడ బోళ్ళకు  సంబంధించి స్టాండ్ ఏర్పాటు చేస్తారు. తర్వాత అదే గోడకు కుళాయిలను కూడా ఏర్పాటు చేస్తారు.

దీంతోపాటుగా కడగడానికి వాష్ బేసిన్ కూడా అంటి పెట్టుకొని ఉంచుతారు. ఈ సందర్భంగా ఏం చేస్తానంటే అక్కడే బోళ్ళు కడిగిన అక్కడే బోర్లించడం, ఇలాంటివి చేస్తారు. అలాగే నీళ్ల బిందెలు కూడా తీసుకువచ్చి ఆగ్నేయ మూలలో పెట్టేసి ఉంచుతారు. అంటే ఆగ్నేయ మూలలో నీళ్ళ బిందె పెట్టరాదు. ఇలా చేయడం వల్ల స్త్రీలలో భార్యాభర్తల మధ్య గొడవల రావచ్చు, బహిష్టు సమస్యలు రావచ్చు, హృదయ సంబంధ సమస్యలు కూడా రావచ్చు, మానసికంగా వేదన పడుతూ ఉండొచ్చు. కాబట్టి ఆగ్నేయ మూలలో ఎలాంటి నీళ్ల బిందెలు పెట్టవద్దని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: