
జాబ్ చేసే మహిళకు ..చిన్నపిల్లలు ఉన్న మహిళలకు.. మరీ ముఖ్యంగా ఇంట్లో ముసలి వాళ్ళ బరువు బాధ్యతలు చూసుకునే మహిళలకు ఉదయం పూట ఇలా ప్రసాదం చేసి పెట్టడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు మనం ప్రసాదం చేసి పెట్టలేకపోయామే ఆ దేవుడు ఆశీస్సులు మనకు రావేమో అని భయపడుతూ కూడా ఉంటారు . కానీ అలా ఏదీ లేదు . భక్తిశ్రద్ధలతో నియమ నిష్టలతో దీపం వెలిగించినా సరే పుణ్య ఫలితం దక్కుతుంది. అయితే శనివారం పూట వెంకటేశ్వర స్వామి కి ఎంతో ఇష్టమైన తులసిమాలను ఆయనకి అలంకరిస్తే చాలా చాలా పుణ్యం దక్కుతుంది అంటున్నారు పండితులు . హిందూ ధర్మంలో తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు.
తులసి మొక్కను పూజించడం మాత్రమే కాదు ఆ తులసి మొక్క ఎన్నో అనారోగ్యాలకు కూడా ఒక దివ్య ఔషధం నే చెప్పాలి . కొంతమంది తులసి ఆకులను ఉదయం లేవగానే తింటూ ఉంటారు . తులసిఆకులను వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా భక్తులు మాల చేసి వేస్తూ ఉంటారు. తులసిమాల శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరించడం ద్వారా ప్రతికూల శక్తులు.. పీడకలలో ప్రమాదాలు నుంచి రక్షణ ఉంటుందట . అంతేకాదు ఇలా చేయడం ద్వారా సంపద - అదృష్టం కలిసి వస్తుందట . తులసిలో అడాప్టోచనిక్ లక్షణాలు ఉంటాయి . ఇవి మనిషి ఒత్తిడిని భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో ప్రయోజకరంగా ఉంటాయి అంటూ వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.
తులసి మాల మనం ధరించడం వల్ల నాడి వ్యవస్థ పై సానుకూల ప్రభావం చూపి ఆందోళన తగ్గిస్తుందట . కేవలం దేవుడు పటాలకే కాదు కొన్ని కొన్ని సార్లు మనం కూడా తులసిమాలను మెడలో వేసుకోని పూజ చేయడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు . మరీ ముఖ్యంగా శనివారం ఎవరైతే నైవేద్యాలు చేసి పెట్టలేని స్థితిలో ఉంటారో వాళ్ళు తులసి ఆకులను మాలగా చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి వేసి పూజలు చేస్తే మంచి ఫలితం దక్కుతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అంతేకాదు తద్వారా ఆ ఇల్లు సిరి సంపదలతో ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుందట..!!
నోట్: పైన తెలిపిన వివరాలు కెవలం ఒక అవగాహన కోసం మాత్రమే. కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు.. జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి అని గుర్తుంచుకోవాలి. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించి.. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయమే..!!