దేవుళ్లకు చేసే ప్రతి పూజలో తులసి దళాన్ని వేసిన నీటిని తీర్థంగా పెడతారు. కానీ ఒక్క గణపతి పూజలో మాత్రం తులసి మొక్కను గానీ తులసి ఆకులను గానీ అస్సలు వాడరట. మరి దేవుళ్లకు ఎంతో ప్రీతికరమైన తులసి ఆకుని ఎంతో పవిత్రంగా భావించే తులసి ఆకులని ఎందుకు వినాయకుడి పూజలో వాడరు..దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి.. పురాణాలు ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి ఆకులను వినాయకుడి పూజలో వాడకపోవడానికి పురాణాల ప్రకారం రెండు కారణాలు చెబుతారు. అందులో ఒకటి వినాయకుడు ధ్యానంలో మునిగిపోయిన సమయంలో తులసిని జీనీ దేవుడు బంధిస్తారట. అయితే అలా బంధించిన సమయంలో గణపతిని చూసి ఆయన దివ్య స్వరూపానికి తులసీదేవి ఆకర్షితురాలవుతుంది. 

దాంతో గణపతి ప్రవేశద్వారం వద్దకు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని చెబుతుంది.కానీ గణేశుడు నేను బ్రహ్మచారిణి అని ఆమె మాటని పక్కన పెట్టడంతో తులసీదేవి కోపంగా వినాయకుడిని రెండు పెళ్లిళ్లు చేసుకోవలసి వస్తుంది అని శపిస్తుందట. ఇక మరో స్టోరీ ఏంటంటే.. ధ్యానముద్రలో ఉన్న వినాయకుడి దగ్గరికి ధర్మద్వజ రాజ పుత్రిక వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పగా వినాయకుడు మాత్రం చేసుకోనని చెబుతాడట.ఆ సమయంలో ధర్మ ధ్వజ యువరాణికి కోపం వచ్చి నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా నిత్య బ్రహ్మచారిగా ఉండుగాక అంటూ శపిస్తుందట.ఇక ఆమె శాపానికి కోపోద్రిక్తుడైన వినాయకుడు వెంటనే ధర్మ ధ్వజ యువరాణిని తిరిగి శపిస్తాడు.

నువ్వు ఎప్పటికీ రాక్షసుడు చేతనే ఉండాలి అంటూ.. అయితే వినాయకుడి శాపానికి భయపడిపోయిన ధర్మ ధ్వజ యువరాణి క్షమించమని వేడుకోగా.. కొద్ది రోజులు రాక్షసుడు చెంత ఉండి ఆ తర్వాత తులసి మొక్కగా మారతావు అంటూ శాపం ఇస్తాడు. ఇక ఎప్పుడైతే ఆ ధర్మ ధ్వజ యువరాణికి శాపం పెడతాడో అలా కొద్దిరోజులు రాక్షసుడు చెంత మరికొద్ది రోజులు తులసి మొక్కగా ఉండాలని వినాయకుడు శపిస్తాడు. అప్పటినుండి తులసి మొక్క ని గానీ ఆకులను గానీ వినాయకుడి పూజలో వాడరట. మిగతా దేవుళ్ళ పూజలో ప్రీతికరంగా ఉండే తులసి మొక్కని తులసి ఆకులని కేవలం వినాయకుడి పూజలో మాత్రం వాడరట.

మరింత సమాచారం తెలుసుకోండి: