ప్రతి మ్యాచ్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ జట్టును విజయతీరాలకు చేరుస్తాడు  అన్న విషయం తెలిసిందే. తనదైన వ్యూహాలతో జట్టును  ముందుకు నడిపిస్తూ... అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవటమే  కాదు... విరాట్ కోహ్లీ వ్యూహాలు కూడా అంతగా ఫలించడం లేదు. న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ లో న్యూజిలాండ్ ను క్లీన్ స్వీప్ చేసి అదరగొట్టినప్పటికీ  ... ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ టెస్ట్ సిరస్ లలో  ఓటమిపాలైంది కోహ్లీ సేన. దీంతో కోహ్లీ ప్రదర్శన పైన కాకుండా మొత్తం భారత జట్టు పై విమర్శలు మొదలయ్యాయి. అయితే సరైన ప్రణాళికలు అమలు చేయకపోవడం వల్లే ఓడిపోయాము  అంటూ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. జట్టు ఆటగాళ్లు అందరూ సమిష్టిగా రాణించటంలో   విఫలం అయ్యారు అంటూ పేర్కొన్నాడు. 

 

 

 

 ఇప్పటికే వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ అయినా భారత తాజాగా రెండు టెస్టుల సిరీస్ లను  కూడా 2-0 న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టు కోహ్లీ ఆటపైనే కాదు  కోహ్లీ నిర్ణయాలపై కోహ్లీ ప్రవర్తన పై కూడా అటు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. జర్నలిస్ట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మైదానంలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మైదానంలో అరుస్తున్న  ఆ ప్రేక్షకుల వైపు తిరిగి విరాట్ కోహ్లీ నోరుమూసుకోండి  అన్నట్లుగా సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు  హల్ చల్ చేశాయి కూడా

 

 

 

 దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. క్రీడా స్ఫూర్తిని మరిచి  కోహ్లీ ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ ఘటనపై స్పందించవలసిందిగా ఓ జర్నలిస్టు కోహ్లీ నీ కోరాడు. దీంతో కోహ్లీ తీవ్ర అసహనానికి లోనయ్యారు. న్యూజిలాండ్ రెండో టెస్టు ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కోహ్లీని జర్నలిస్ట్  ప్రశ్నించారు. మైదానంలో కివీస్ ఆటగాడు అవుట్ అయినప్పుడు  వేలు పైకెత్తి ఏదో అన్నట్టు గా కనిపించారు సరిగ్గా ఉండాలని మీకు తెలియదా అంటూ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. అసంపూర్తి సమాచారంతో  ఇక్కడకు రాకూడదు.. ఒకవేళ వివాదాలు సృష్టించాలీ అనుకున్న ఇది వేదిక కాదు అంటూ కోహ్లీ బదులిచ్చాడు.దీంతో  విరాట్ కోహ్లీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: