ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో వాట్సప్ కూడా ఒకటి.. వాట్సప్ ఈ మధ్యకాలంలో తరచూ సరికొత్త ఫిచర్స్ ను సైతం అందిస్తూ ఉంటోంది. ఈ చాటింగ్ యాప్ ను మరింత అప్డేట్ కరంగా మారుస్తున్నారు వాట్సప్ సంస్థ. ఇటీవలే వాట్సప్ కస్టమర్ ల కోసం ఎడిటింగ్ మెసేజ్ ఆప్షన్ కూడా తీసుకువచ్చింది.మల్టీఫోన్ యూజెస్ వంటి గొప్ప ఉపయోగపడే ఎటువంటి ఫీచర్స్ ని కూడా అందించింది వాట్సాప్ సంస్థ. ఇప్పుడు మరొక ఉపయోగకరమైన సరికొత్త ఫీచర్ ను సైతం తమ కస్టమర్ల కోసం తీసుకురావడం జరుగుతోంది.

వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతున్నట్లు కొన్ని స్క్రీన్ షాట్లను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. wabetainfo ప్రకారం వాట్సప్ ఆప్ కమింగ్ అప్డేట్ ల నుండీ IOS, ఆండ్రాయిడ్ మొబైల్ లో కూడా హెచ్డి ఫోటోలను నేరుగా షేర్ చేసుకునే విధంగా ఈ అప్డేట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వాట్సప్ యూజర్లు ఈ సరికొత్త ఫీచర్ను అప్కమింగ్ అప్డేట్ ద్వారా అందుకుంటారని తెలియజేస్తోంది. అందుకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్ లో సైతం ట్విట్టర్లో వైరల్ గా మారుతున్నాయి.

ఇప్పటికే కొంతమంది బీటా టెస్టర్లకి ఈ సరికొత్త ఫీచర్స్ ని సైతం HD ఫోటోలను షేరింగ్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా ఈ ట్విట్టర్ ద్వారా తెలియజేసినట్టు తెలుస్తోంది.వాస్తవానికి హెచ్డి ఫోటో షేరింగ్ కోసం ప్రస్తుతం చాలామంది యూజర్స్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ని సైతం ఎంచుకోవడం జరుగుతోంది. అంటే ఫోటోలను డాక్యుమెంట్ ఆప్షన్ ద్వారా పంపిస్తే ఎటువంటి నష్టం లేకుండానే క్వాలిటీ ఫోటోలను సెండ్ చేయవచ్చు. అయితే వాట్సాప్ అప్ కమింగ్ ఫీచర్స్ ద్వారా నేరుగాని ఇక మీదట హెచ్డి ఫొటోలను సైతం షేర్ చేయవచ్చని తెలుస్తోంది. మరి వీటి గురించి పూర్తి వివరాలు త్వరలోనే అప్డేట్ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: