ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కాలానికి అనుగుణంగానే అప్డేట్ అవుతూ వస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ట్రెండ్ కు తగ్గట్లుగా వీడియోలు చేయడం ఇక వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫేమస్ కావాలని ప్రయత్నించడం లాంటివిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ... ఇక ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఎన్నో వీడియోలు అటు నెటిజెన్స్ అందరిని కూడా పగలబడి నవ్వేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. దేశవ్యాప్తంగా ప్రతి చోట బస్సు సౌకర్యం ఉంది అని చెప్పాలి. ఎక్కడికి వెళ్లాలన్న రోడ్డు పక్కన నిలబడి ఒకసారి బస్సు ఆపాలి అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చామంటే చాలు వెంటనే డ్రైవర్ బ్రేక్ వేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా ఎంతోమంది అటు బస్సుల ద్వారానే ప్రయాణం సాగిస్తూ రోజువారి కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నారు.


 సాధారణంగా గ్రామాలకు వెళ్లే బస్సులు అయితే దారి మధ్యలో చేయి ఎత్తి చూపగానే వెంటనే ఆగుతూ ఉంటాయి. ఇది అందరికీ అనుభవం ఉండే ఉంటుంది. అయితే కొంతమంది ఆకతాయిలు చేసే పనులు మాత్రం బస్సు డ్రైవర్లకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఒక యువకుడు రోడ్డు పక్కనే కాలేజీ బ్యాగ్ వేసుకొని నిలబడి ఉండటం చూడవచ్చు. అయితే అదే సమయంలో అక్కడికి ఒక బస్సు వస్తుంది. కానీ బస్సు అతని దగ్గర ఆగిన వెంటనే అతను బస్సు ఎక్కకుండా పక్క నుంచి వస్తున్న సైకిల్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అతను అలా చేయడంతో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా అవాక్ అవుతాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: