ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నిన్నటితో ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా నిలవడం జరిగింది.. ఐదవ సారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ని కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఎంఎస్ ధోని తన ఐపీఎల్ కెరియర్ కు సంబంధించిన ప్రధాన అప్డేట్ కూడా అందించినట్లు సమాచారం.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడించి 5వ ఇండియన్ ప్రీమియం టైటిల్ ని కైవసం చేసుకున్నది.. ఆ తర్వాత ధోని తన రిటైర్మెంట్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.

ధోని మాట్లాడుతూ నా వైపు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు ఒక బహుమతి అంటూ పేర్కొన్నట్లు తెలిపారు.. నేను రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం.. కానీ ఈ సంవత్సరం నేను ఎక్కడ ఉన్న నాపై చూపించిన ప్రేమ ఆప్యాయత ఇది నాకు తేలికైన విషయం కాదని నేను భావిస్తున్నానంటూ తెలియజేసినట్లు తెలుస్తోంది ధోని. ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో తమ అద్భుతమైన రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ధోని ప్రతి ఒక్కరు దృష్టిని ఆకర్షించారు.


ఏడాది ఐపీఎల్ మొత్తం ఫైనల్ మ్యాచ్ కూడా ధోని మేనియాతోనే నడిచిందని చెప్పవచ్చు.. ధోని వచ్చే ఏడాది మరొకసారి చెన్నై సూపర్ కింగ్స్ కి న్యాయకత్వం వహిస్తారా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు మరి రాబోయే రోజుల్లో ధోని ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. నిన్నటి రోజున ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా జరిగిందని చెప్పవచ్చు.. చివరి బాలు వరకు చాలా ఉత్కంఠంగా జరిగేసరికి ఎట్టకేలకు రవీంద్ర జడేజా చివరి రెండు బంతులలో ఒక సిక్స్ ఫోర్ ని కూడా కొట్టడం జరిగింది దీంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయంగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: