ఆటో మొబైల్ కంపెనీలు కొత్త స్కూటర్లు మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ కంపెనీలు అయితే మాత్రం చెప్పనక్కర్లేదు పోటీ పడి మరీ పీచర్లను అందిస్తూ వస్తున్నాయి.. కస్టమర్లకు ఎటువంటి మార్పులు కలగ కుండా చూస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రముఖ కంపెనీ హోండా ఎన్నో కొత్త కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. ఇప్పుడు మరో కొత్త బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.. 



హోండా కంపెనీకి మార్కెట్ డిమాండ్ నానాటికీ పెరుగుతూ వస్తుంది. అయితే ప్రజల దృష్టిని మరింత ఆకర్షించడానికి మరో కొత్త స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది..అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ మొబైల్ అప్లికేషన్ ఆధారిత కనెక్టువిటీ ఫీచర్ ను పరిచయం చేసేందుకు హోండా సన్నాహాలు చేస్తుంది.. ఈ కనెక్టివిటీ టెక్నాలజీ కి “రోడోసింక్” అనే పేరు. కూడా పెట్టింది. బ్లూటూత్ ఆప్షన్ ద్వారా బైక్ను డ్రైవర్ యొక్క మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవాలి.స్కూటర్లు కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా చేస్తుంది.. అందుకే ఈ కంపెనీ బైకులకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కంపెనీ స్కూటర్ గురించి చెప్పినప్ప టి నుంచి లాంఛ్ అయ్యేవరకు యువత ఎదురు చూస్తున్నారు అంటే ఈ కంపెనీ రేంజ్ ఎంటో అర్థమయ్యే ఉంటుంది..



ఇకపోతే నావిగేషన్, ఫోన్ కాల్స్,మెసేజింగ్, మ్యూజిక్ వంటి వాటిని కంట్రోల్ చేయవచ్చు.అంతేకాకుండా వాయిస్ సపోర్ట్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. దీని ద్వారా డ్రైవర్ తన వాయిస్ తో కొన్ని వివిధ కమాండ్స్ చేయడం ద్వారా ఈ టెక్నాలజీ లోని వివిధ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. ఇకపోతే ఏదైనా అంతర్గత ప్రమాదం జరిగే సమయాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు..ఈ ఫీచర్ను సిబిఆర్ 1000 ఆర్, హోండా ఫోర్జా, హోండా ఫోర్జా750, ఎక్స్ అడ్వెంచర్ మోడళ్లలో ఈ ఫీచర్లు త్వరలోనే ప్రవేశ పెట్టనుంది. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ బైక్ ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: