ఐక్య రాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం..ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 2004-06 సంవత్సరాల మధ్య 12.2 శాతంగా ఉంది. 2019-21 మధ్య ఇది కేవలం 3 శాతం మాత్రమే తగ్గి 9 శాతానికి చేరుకుంది. ఇక భారత్‌లో 2004-06 మధ్య ఈ సంఖ్య 21.6 శాతంగా ఉండగా.. 2019-21 మధ్య 16.3 శాతానికి తగ్గింది. అంటే.. ఇంకా నూటికి 16 శాతం మంది ఆకలితో మగ్గిపోతున్నారు.
ఈ సంఖ్య చైనాలో కేవలం 2.5 శాతమే కాగా.. మన పక్కన ఉన్న నేపాల్‌లోనూ కేవలం 5.5 శాతమే కావడం విశేషం. ఇక పాకిస్తాన్‌లో మాత్రం దాదాపు మన పరిస్థితులే ఉన్నాయి. అక్కడ ఆకలితో మగ్గుతున్న వారి సంఖ్య జనాభాలో 16.9 శాతంగా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి