ప్రపంచంలో రోజు రోజుకీ టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. ఈ తరుణంలో కొత్త కొత్త పరికరాలను ఆవిష్కరిస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్, ఎంట్ర టైన్ మెంట్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నారు. రోజు రోజుకీ కొత్త కొత్త ఫీచర్లతో టీవీలు, స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ఈ మద్య రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటూ స్మార్ట్ ఫోన్ల ఇండస్ట్రీలో సంచలనం రేపిన రింగింగ్ బెల్స్ సంస్థ ఆ ఫోన్లను ఎప్పుడు డెలివరీ చేయనుందో కానీ... ఇప్పుడు దాని కన్ను కారుచౌక ఎల్.ఇ.డి. టీవీ అమ్మకాలపై పడింది.  

రూ.9900కే 31.5 అంగుళాల హెచ్.డి. ఎల్.ఇ.డి అందజేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది..దీని పేరు ఫ్రీడం 9900. అయితే ఈ టీవి కోసం బుకింగ్ ఆగస్టు 15న దేశ స్వాతంత్య్ర దినోత్సవం నుండి మొదలవుతాయి. క్యాష్ ఆన్ డెలివరి కింద టెలివిజన్లను ప్రజల ఇంటి వద్దే డెలివరీ చేయనున్నామంది. ఈ టెలివిజన్ కావలసినవారు రింగింగ్ బెల్స్ సంస్థ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: