ఇటీవల కాలంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్న తీరు చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న వీధి కుక్కలకు ఏదైనా గాలి సోకిందా ఏంటి అని అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటది. అంతేకాదు వీధి కుక్కలకి మనుషులకి ఏకంగా పుట్టుకతోనే జాతి వైరం ఉందేమో అన్నట్లుగా వీధి కుక్కలు రెచ్చిపోతూ  ఉన్నాయి. ఏకంగా మనుషులు కనిపిస్తే చాలు మీద పడిపోతూ పీక్కుతినేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇలా దాడులు చేసి ఎంతోమంది ప్రాణాలను గాల్లో కలిపేసాయి. చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరిని వదలడం లేదు వీధి కుక్కలు.


 ప్రతి ఒక్కరు వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ వీధి కుక్క దాడి చేసి పీక్కు తింటుందో.. ప్రాణాలు తీస్తాయో అని బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే ఉన్నారు అని చెప్పాలి. ఈ పరిస్థితి కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అటు ప్రభుత్వ అధికారులు వీధి కుక్కల దాడుల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. వెరిసి ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో ఎక్కడో ఒకచోట వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటే ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా 12 ఏళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన భయానక వీడియో చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. బాలుడు కాంపౌండ్ నుంచి బయటికి వచ్చి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఒక వీధి కుక్క ఆకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చిందో పరిగెత్తుకుంటూ వచ్చి అతనిపై దాడి చేసింది. అయితే ఆ కుక్క నుంచి వదిలించుకునేందుకు అతను ఎంత ప్రయత్నించినా.. ఆ కుక్క మాత్రం మరింత రెచ్చిపోయి గాయపరిచింది. ఎట్టకేలకు ఇక పక్కనే ఉన్న గేట్ లోపలికి వెళ్లి వీధి కుక్క బారి నుంచి గాయాలతో ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడు బాలుడు. ఈ వీడియో వైరల్ గా మారగా ఇది చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: