
ఇన్ని సీట్లను వారికే కేటాయిస్తే.. మరి ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు ఏమవ్వాలి ? అనేది ప్రశ్న. నిజానికి టీడీపీలో ఒక సంప్రదాయం ఉంది. పార్టీ ఓడిపోయిన సందర్భాల్లో సీనియర్లు ఎక్కడి వారు అక్కడకు సర్దుకుంటారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి పుంజుకుని.. టికెట్ల రేసులో ముందుంటారు. ఆర్థికంగా కూడా వారు బలంగా ప్రయత్నాలు చేస్తారు. నిన్న మొన్నటి వరకు కూడా జరిగింది ఇదే. అందుకే .ఇప్పుడు కూడా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా.. చూస్తు ఊరుకున్నారు. కానీ, రేపు ఎన్నికలు అనే సరికి.. జలజలా .. పార్టీ అధినేత చుట్టూ చేరిపోతారు.
కానీ, ఇప్పుడు ఇలాంటి వారికి ఛాన్స్ లేదని.. చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ఇది ఒకరకంగా చూస్తే.. మంచి నిర్ణయమే. ప్రస్తుతం పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వడం అనేది అందరూ హర్షించే నిర్ణయమే. కానీ, అదేసమయంలో పార్టీకి వెన్నదన్నుగా ఆర్థికంగా బలంగా ఉన్న సీనియర్లను కాదని.. అంటే.. రేపు ప్రభావం పడదా? వారి సూచనలు సలహాలు లేకుండా సామాజిక వర్గాలను సమీకరించకుండా.. పార్టీ బలపేతం అయ్యేనా.. గెలుపు గుర్రం ఎక్కేనా? అనేది ప్రశ్న. ఏదైనా.. ఇలాంటి వ్యూహాలు ఉంటే.. ఎన్నికలు ముందు చెప్పకుండాననే అమలు చేయడం.. అనేది నాయకుడి లక్షణం.
గతంలో వైసీపీలోనూ.. ఇలానే జరిగింది. ఎందరో సీనియర్లను పక్కన పెట్టి.. యువతకు టికెట్ ఇచ్చారు. దీనిని ఒకరిద్దరుమాత్రమే ఆందోళన చేశారు. పెద్దగా వ్యతిరేకత రాలేదు. కానీ,... ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఇలా ప్రకటన చేయడం వల్ల.. మాకెందుకులే.. అని సీనియర్లు తప్పుకుంటే.. చంద్రబాబు పరిస్థితి ఏంటి? అనేది మేధావులు సంధిస్తున్న ప్రశ్న. మరి ఏం చేస్తారో చూడాలి.