
ఇప్పటికే జనసేనతో పొత్తుకు సిద్ధమనే సంకేతాలు పంపించారు. అయినప్పటికీ.. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలోనూ చేరితే మరింతగా బలం పుంజుకుని.. రాష్ట్రంలో ప్రజలకు సంకేతాలు పంపించవచ్చని.. చంద్రబాబు వ్యూహంగా ఉంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశం.. ప్రజల్లో ఇంకా సజీవంగానే ఉంది. దీనిని సాధిస్తాననే గత ఎన్నికల్లో జగన్ అదికారంలో కి వచ్చారు. అయితే.. బీజేపీ ఉండగా అది సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. పైగా తాము అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదా ఇస్తామ ని.. కాంగ్రెస్ నాయకుడు.. రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి జాతీయస్థాయిలో అడుగులు వేయడం మంచిదనే భావన చంద్రబాబులో ఉన్నట్టు తెలుస్తోందని.. రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
అయితే.. ఈ ఫార్ములా పనికిరాదని.. పలువురు అంటున్నారు. 2019లో ఇలాంటి ఫార్ములాతోనే చంద్రబాబు ఇబ్బందులు పడ్డారని.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసి.. ఏపీ ఎన్నికల్లో పార్టీకి దూరంగా ఉ న్నారని.. దీంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లి పార్టీకి నష్టం చేకూర్చిందని.. గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కంటే.. కూడా ఏపీలో టీడీపీబలోపేతం కావాల్సిన అవసరం ఉందని.. ముందు ఏపీలో నిలబెట్టుకుంటే.. జాతీయస్థాయిలో ఎప్పుడైనా కుదురుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని.. చంద్రబాబు అడుగులు వేయాలని తమ్ముళ్లు సైతం గుసగుసలాడుతున్నారు.
``రాష్ట్రంలో పార్టీ బలపడితే.. ఎంపీలు పెరిగితే.. అది మాకు.. జాతీయ స్థాయిలో అనూహ్యమైన గుర్తింపును తీసుకువస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సమస్యారాదు. లేదు. దీనిని మరిచిపోకుండా.. పనిచేయాలి. అంతే తప్ప.. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌తో కలిసి చేతులు కలిపితే.. ప్రజల్లో మళ్లీ బ్యాడ్ సంకేతాలు వెళ్తాయి`` అని ఓ ఎమ్మెల్సీ బాహాటంగానే వ్యాఖ్యానించారు. అయినా.. ఇప్పటికిప్పుడు .. జాతీయ రాజకీయాలకు దృష్టి సారించాల్సిన అవసరం లేదని.. చంద్రబాబుకు సూచించినట్టు ఆయన చెబప్పారు. రాష్ట్రంలో 18-20 మంది ఎంపీలను సాధించుకుంటే.. తర్వాత.. ఆటోమేటిక్‌గా జాతీయ రాజకీయాల్లోప్రాధాన్యం పెరుగుతుందని అంటున్నారు. 2019 నాటి తప్పును ఇప్పుడు చేయకుండా ఉంటే బెటర్ అని అంటున్నారు.