
ఎక్కువ మంది మంత్రులను మార్చుతున్నారనే వార్తల నేపథ్యంలో ఎవరు ఉంటారనేది చెప్పడం కష్టం గా మారింది.దీంతో ఒకరిద్దరు మినహా.. మంత్రులు అందరూ.. తమ తమ శాఖల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎందుకంటే... తమ శాఖలో పెండింగులో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడంతోపాటు.. తమ వారికి ఏదైనా చేసుకోవాలనే ఆరాటం వీరిలో టెన్షన్ పెడుతోంది. ఇప్పటి వరకు రెండున్నరేళ్లపాటు.. మంత్రులుగా పనిచేశారు. అయితే.. కొందరు తమ శాఖలకు వచ్చి మొహం చూపించి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు.
కానీ, ఇప్పుడు జిల్లాలు ఏర్పడ్డాయి. అధికారులు మారిపోయారు. రేపు ఆయా పనులను వారు చేయకపోతే... ఇబ్బందేనని ప్రస్తుతం ఉన్న మంత్రులు భావిస్తున్నారు. దీనికి తోడు మంత్రి వర్గం మారిపోయి.. కొత్తగా వచ్చే మంత్రులు ఆయా పనులను పక్కన పెట్టినా.. తమకు ఇబ్బందని చాలా మంది మంత్రులు అభి ప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడలోనే బసచేసి.. గత రెండు రోజులుగా..పనులు చక్కబెట్టు కుంటున్నారని.. తెలుస్తోంది.
పదవులు పోయిన తర్వాత.. ఆ పనిచేయండి.. ఈ పనిచేయండి.. అని కొత్త మంత్రుల చుట్టూ తిరగడం కంటే... తమ చేతుల్లో ఉన్న ఒక్కరోజు అవకాశాన్ని వినియోగించుకోవడమే బెటర్ అని ఎక్కువ మంది అనుకుంటున్నారట. దీంతో ఇప్పుడు అన్ని శాఖల్లోనూ.. దాదాపు.. ఫుల్ లెంగ్త్‌లో పనులు జరుగుతున్నాయి. మరి.. ఈ క్రమంలో తమ అనుయాయులకే.. పనులు చేస్తారా? లేక.. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారా? అనేది చూడాలి.