కెనడా, బ్రిటన్, అమెరికా నుంచి భారత్ లో విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిక్ ఫర్ జస్టిస్ సంస్థ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ గా కొందరు ఏర్పడ్డారు. అయితే ఈ దేశాల్లో వీరు నివసిస్తూ భారత్ లో విద్వేశాలు రేపడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలా ఏర్పడిన ఈ సంస్థపై భారత్ నిషేధం విధించింది. ఖిలిస్థాన్ టైగర్ ఫోర్స్ అనే సంస్థను ఉగ్రవాద  సంస్థగా గుర్తిస్తున్నామని భారత్ ప్రకటించింది. అంతే కాదు ప్రపంచ దేశాలకు వర్తమానాన్ని పంపింది.


అయితే ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి ఫండింగ్ అందుతున్నాయని తెలుస్తోంది. మన దేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో సిక్కు యువతకు మాదక ద్రవ్యాలను అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేస్తోంది ఈ సంస్థే. ఎర్ర కోట మీద కత్తులతో దాడులు చేసి వీరంగం సృష్టించింది కూడా వీరే. ముఖ్యంగా ఇలాంటి నీచులను సమర్థిస్తున్న వారు ఇండియాలో కూడా ఉన్నారు. ఎందుకంటే వారికి ఓట్లు కావాలి. కానీ దేశ భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు.


అయితే వీరికి నిధుల పరంగా కాకుండా మిగతా విషయాల్లో కూడా పాకిస్థాన్ నుంచి మద్దతు వస్తోంది. కాబట్టే వీళ్లు విదేశాల నుంచే భారత్ లో కుట్రలు చేయాలని పథకాలు రచిస్తుంటారు. దీన్ని గమనించిన భారత్ ఈ సంస్థను ఉగ్రవాద సంస్థ గుర్తిస్తూ ప్రపంచ దేశాలకు చెప్పేసింది. వీరిని ప్రోత్సహించవద్దని ఇలాంటి సంస్థలకు ఎలాంటి ఫండ్స్ ఇవ్వవద్దని కోరింది. ఈ ఖలిస్తాని టైగర్ ఫోర్స్ నాయకుడు హరివిందర్ సింగ్ సందోళిని తీవ్రవాదిగా ప్రకటించి ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది.


ఈ ఖలిస్థాని ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని ఎవరూ నమ్మవద్దని చెప్పేసింది. ఆయా దేశాల్లో ఉన్న ఖలిస్తాని ఫోర్స్ తీవ్రవాదులు భారత్ పై ఎలాంటి విషం చిమ్ముతారోనని కేంద్ర ప్రభుత్వం ఓ కంట కనిపెడుతూనే ఉంది. వీరిని అడ్డుకోవడానికి ముందుగానే గుర్తించి ప్రపంచానికి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: