
కాపు, గౌడ, రజక రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించడం, కాపుల్లో ఉపముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు నమ్మించడం, మెజారిటీ కాపులు పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అవుతాడని నమ్మడం. ఓటుకు డబ్బులు క్లియర్ గా పంచడం, అనంతపురం హిందూపురంలో బోయ, కొడములకు సీటు ఇస్తానని ఇవ్వకపోవడంతో వెళ్లి టిడిపిలో చేరడం, ఐదేళ్లపాటు పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఉండడం.
ఖచ్చితంగా గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉండడం, తెలంగాణలో ఒకరోజు, ఇక్కడ ఒకరోజు ఎన్నికలు ఉండడం, టిడిపి వాళ్ళు ముందుగానే ఊహించి ఓట్లను అక్కడ ఇక్కడా నమోదు చేసుకోవడం, ధర్మవరం, రాప్తాడు మొదలైన చోట్ల దాదాపు 15వేల దొంగ ఓట్లు ఉండటం, అప్పుడు ప్రోపర్ హోంవర్క్ చేయకపోవడం ఇలాంటివన్నీ వైఎస్సార్సీపీ ఓటమికి ముఖ్యమైన కారణాలుగా నిలిచాయి.
తెలుగు దేశాన్ని అంటిపెట్టుకున్న బీసీ వర్గాలు ముఖ్యంగా చేనేత, రజక,యాదవ, గౌడ వీళ్ళకి జగనన్న అమ్మ ఒడి, ఇళ్ల స్థలం, ఇంటింటికి పెన్షన్లు, రైతు భరోసా ఇంకా 21 రోజుల్లో ధాన్యానికి నగదు, ఆసరాకు చేదోడు వీటన్నింటినీ కంటిన్యూ చేస్తాం. అది పవన్ కళ్యాణ్ వల్ల కాదని చెప్తున్నారాయన.