అదానిని అడ్డుపెట్టుకొని భారత ఆర్థిక పరిస్థితిని కూల త్రోసే కుట్ర వికటించిందని తెలుస్తుంది. భారత్ మార్కెట్ మీద ఎఫ్డిఐలు ఇప్పుడు దృష్టి సారించాయని తెలుస్తుంది. బలమైన స్థూల అధిక గణాంకాలతో పాటుగా షేర్ల ధరలు హేతుబద్ధంగా ఉండడం ఇందుకు కారణమని అంటున్నారు. వాళ్లు మే నెలలో 27,316 కోట్లు ఇన్వెస్ట్ చేశారని తెలుస్తుంది. ఇది గత ఆరు నెలల్లో గరిష్ట స్థాయి అని చెప్తున్నారు.


గత నవంబర్ లో నమోదైన 39,219 కోట్ల తర్వాత ఎఫ్డీఐ పెట్టుబడులు ఈ స్థాయిలో ఉండడం ఇదే ప్రథమం అని అంటున్నారు. డిపాజిట్రీ వద్ద అందుబాటులో ఉన్న గణంకాల ప్రకారం ఏప్రిల్ లో 11,626 కోట్లు, మార్చిలో 7,999 కోట్లు ఇన్వెస్ట్ చేశారట. అంతకు ముందు జనవరి, ఫిబ్రవరిలో 34,000 కోట్లు ఉపసంహరించారట. ఎఫ్డిఐ పెట్టుబడుల మద్దతుతో  నిఫ్టీ 2.4 శాతం వృద్ధి చెందిందని చెప్తున్నారు.


ఈ తాజా పెట్టుబడులతో ఈ ఏడాది ఇప్పటివరకు  ఎఫ్డీఐ భారత్ ఈక్విటీ మార్కెట్ లో నికరంగా 2,737 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుందట. ఈక్విటీ మార్కెట్ తో పాటు  వాళ్లు టెట్ మార్కెట్లో కూడా 1432 కోట్లు ఇన్వెస్ట్ చేశారట. అయితే అమెరికా ప్రభుత్వం రుణ పరిమితి నిర్ధారణ అవడంతో పాటు భవిష్యత్తులో రానున్న స్థూల ఆర్థిక గణాంకాలు కూడా సానుకూలంగా ఉండాలని ఆశిస్తున్నారు వాళ్ళు.


ఒకవేళ అలా  కనుక ఉంటే విదేశీ పెట్టుబడిదారుల నుండి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని మార్నింగ్ స్టార్ అసోసియేషన్ చెప్తుంది. అదాని ఇంపాక్ట్ తో షేర్ మార్కెట్ గట్టి కుదుపులకు గురైనట్లుగా తెలుస్తుంది. ఆ డబ్బులు అన్ని ఇప్పుడు వెనక్కి విత్ డ్రా చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడ ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెంచిందో ఇక్కడ షేర్లలో ఉన్న డబ్బులు తీసుకెళ్లి అక్కడ డిపాజిట్ చేసుకుంటున్నారట. అయితే అ పరిస్థితి ఇప్పుడు మారి మన వైపుకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: