ఏపీలో బీజేపీ, వైసీపీ మధ్య మొదటి నుంచి స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. రాష్ట్ర నాయకత్వంతో పెద్దగా సఖ్యత లేకపోయినా.. దిల్లీ స్థాయిలో మాత్రం స్నేహం ఉంది. అయితే.. ఇటీవల రాష్ట్ర నాయకత్వం వైసీపీ సర్కారుపై ఫైర్ అవుతోంది. ఇటీవల భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ప్రమేయం అధికంగా ఉంటోందని... నిరూపిస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? అని సోము వీర్రాజు సవాల్‌ విసిరారు.


ధాన్యం కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని సోము వీర్రాజు ఆవేదన చెందారు. మిల్లర్లు లేకుండా ధాన్యం సేకరణ చేస్తామని ప్రభుత్వం నమ్మబలుకుతోందని సోము వీర్రాజు దుయ్యబట్టారు. వాస్తవానికి ఈ ప్రభుత్వం మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మిల్లర్లు లేకుండా మనుగడ సాగించే పరిస్థితి ప్రభుత్వంలో లేదని సోము వీర్రాజు అన్నారు.


కాకినాడ పోర్టు నుంచి భారీ ఎత్తున ధాన్యాన్ని ఎగుమతి చేస్తూ మిల్లర్లకు లబ్ది చేకూరుస్తోందని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకుంటే ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్ర సంస్థ ఎఫ్‌సీఐకి అప్పగించాలని డిమాండ్‌ సోము వీర్రాజు చేశారు.  రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ లేకుండా పోవడం బాధాకరమని భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  రోజూ పరిశ్రమలు వస్తున్నాయని మంత్రులు ప్రకటనలు ఇస్తున్నారన్న భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజురూ. 30 కోట్ల టెలిపోన్లను మేకిన్ ఇండియాలో భాగంగా ఉత్పత్తి చేశారని గుర్తు చేశారు.


ఈ ఉత్పత్తిని రూ. 60 కోట్లకు తీసుకెళ్లాలని మోదీ భావిస్తున్నారని భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు న్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యం లేదంటే జగన్ పని తీరు అర్ధం అవుతుందని భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఐటీ పరిశ్రమ పై రాష్ట్ర ప్రభుత్వం విధానం ఏమిటో ప్రకటించాలని వీర్రాజు కోరారు. ఒన్ సన్, ఒన్ గ్రిడ్, ఒన్ వరల్డ్ అనేది ప్రధాని సిద్ధాంతమని... కేంద్రం ప్రభుత్వం నిర్ణయాల వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: