
జనసేన రాష్ట్రంలో వైసీపీని గద్దె దించేందుకు ఒక మెట్టు కిందకు దిగింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం బిజెపితో కలిసి పొత్తు పెట్టుకుని కూటమిగా ఎన్నికలలో పోటీ చేసింది. మరీ ముఖ్యంగా బిజెపిని కూటమిలోకి తీసుకువచ్చేందుకు పవన్ చాలా త్యాగం చేశారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేందుకు చాలా సీట్లు వదులుకున్నారు. అయితే పవన్ త్యాగానికి ఫలితం దక్కింది. పోటీ చేసిన 21 యొక్క అసెంబ్లీ ... రెండు పార్లమెంటు స్థానాలలో జనసేన ఘన విజయం సాధించింది. కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ ఉప ముఖ్యమంత్రిగాను ... జనసేనకు చెందిన కందుల దుర్గేష్ - నాదెండ్ల మనోహర్ ఇద్దరూ మంత్రులుగాను కొనసాగుతున్నారు. రాబోయే 15 ఏళ్ల పాటు పక్క రాజకీయ ప్రణాళికలతో ముందుకు వెళతానని పవన్ పదేపదే చెబుతున్నారు. ఈ లక్ష్యం సాధించాలన్నా క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకునేలా చేయాలన్న బలమైన కార్యకర్తలు ... బలమైన నాయకులు అవసరం పార్టీకి ఎంతైనా ఉంది.
జనసేనలో నాయకులు ఉన్నారు. పవన్ అంటే ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఉన్నారు. పైకి అందరూ ఎలా ఉన్నారు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకునే నాధుడు అంటూ ఎవరూ లేకుండా పోయారు. కార్యకర్తలను సంతృప్తి పరచాలన్న పార్టీకి ఇదే కీలకమైన సమయం. పార్టీ అధికారంలో ఉంది.. పార్టీ అధినేత ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు .. కోరుకున్న పనులు జరుగుతాయని ... కీలక నేతలకు పదవులు వస్తాయని అందరూ ఆశలతో ఉన్నారు. అయితే ఇప్పుడు అది జరగటం లేదు. టిడిపిలో అయినా ... బిజెపిలో అయినా కూటమి అధికారంలో ఉండడంతో ఎంతో పనులు జరుగుతున్నాయి. కానీ మెజార్టీ జనసేన కార్యకర్తల విషయంలో మాత్రం తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. మరి పవన్ కార్యకర్తలను సంతృప్తి పరచకపోతే కచ్చితంగా పార్టీకి ఇది పెద్ద మైనస్ అవుతుంది అనటంలో సందేహం లేదు.