చరిత్ర అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొందరు చరిత్రలో నిలిచిపోయిన మహానుభావుల జన్మ దినాలు ఇంకా చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు గురించి తెలుసుకోండి.ఇక 1885 వ సంవత్సరంలో లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ని మొట్టమొదటి సారిగా వాడటం జరిగింది.1964 వ సంవత్సరంలో మాలవిలో న్యాసాలేండ్ ఒక స్వత్రంత్ర రాష్ట్రంగా అవతరించడం జరిగింది.1986 వ సంవత్సరంలో పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమవ్వడం జరిగింది.

ఇక చరిత్రలో ఈ రోజు ప్రముఖుల జాననాలు చూసినట్లయితే....1785 వ సంవత్సరంలో జాన్ పాల్ జోన్స్ అనే అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధ వీరుడు జన్మించాడు.ఇక 1796 వ సంవత్సరంలో నికోలస్ - I, అనే రష్యన్ జార్ జన్మించాడు.1827 వ సంవత్సరంలో థామస్ మన్రో అనే స్కాట్లాండ్ కు చెందిన యోధుడు, అధికారి జన్మించారు.1856 వ సంవత్సరంలో తల్లాప్రగడ సుబ్బారావు అనే అసాధారణ మేధావి జన్మించారు.1901వ సంవత్సరంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ అనే ప్రముఖ భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు జన్మించారు.1913 వ సంవత్సరంలో గూడూరి నాగరత్నం అనే ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు జన్మించారు.

1925 వ సంవత్సరంలో జానెట్ లీ అనే అమెరికన్ సినీనటి జన్మించారు.1930 వ సంవత్సరంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనే వాగ్గేయకారుడు జన్మించారు.1935 వ సంవత్సరంలో 14వ దలై లామా అయిన టిబెటన్ బౌద్ధ మతగురువు జన్మించారు.1948 వ సంవత్సరంలో ఛాయరాజ్ అనే ప్రముఖ కవి, రచయిత జన్మించారు.1962 వ సంవత్సరంలో ఎం. సంజయ్ అనే ప్రముఖ జగిత్యాల శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు జన్మించారు.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన ప్రముఖుల మరణాలు చూసుకున్నట్లయితే...1999 వ సంవత్సరంలో ఎం.ఎల్.జయసింహ అనే హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు చనిపోయారు.ఇక 2002 వ సంవత్సరంలో రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ మరణించారు.2015 వ సంవత్సరంలో భాట్టం శ్రీరామమూర్తి అనే వివాదరహితుడైన రాజకీయ నాయకుడు మరణించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: