ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి మల్టీస్టారర్ అన్న సమయంలోనే ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించబోతున్నారని తెలిశాక బాహుబలిని మించిన అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు టీజర్లు విడుదల కాగా.. రెండింటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. క్లైమాక్స్ షూటింగ్ కూడా మొదలైందంటూ ఇటీవల దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నిజానికి ఈ చిత్రం 2020 జూలైలోనే రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో 2020 జూలై నుంచి 2021 జనవరికి పోస్ట్ పోన్ అయింది. అయితే మళ్లీ 2021 జనవరిన కూడా ఈ చిత్రం రావడం లేదని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ చిత్రం 2021లో కూడా వచ్చే అవకాశం లేదని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే కొద్ది సేపటి క్రితం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఓ ట్వీట్ చేసింది.

‘మీరందరూ ఎంతగానో వేచి చూస్తున్న అనౌన్స్‌మెంట్ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు చేయబోతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ చిత్ర విడుదల తేదీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేయనున్నట్టు అభిమానులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 8న విడుదల కాబోతోదంటూ చిత్రంలో నటిస్తున్న ఇంగ్లీషు నటి ఇటీవల ఓ ట్వీట్  చేసి వెంటనే డిలీట్ చేసేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 8న చిత్రం విడుదల కాబోతున్నట్టు చిత్ర యూనిట్ 2 గంటలకు అనౌన్స్ చేసే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: