
ఒకప్పడు వ్యభిచారిణిగా మారిందని కూడా వార్తలు వచ్చాయి. రెడ్ హ్యాండెడ్ గా ఆమె దొరికిందికూడా అయితే అది ఒట్టి ఆరోపణ అని అప్పట్లో తేలింది.. అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత పెళ్లి చేసుకుంది హాయిగా ఉంది. కానీ ఆ పెళ్లి కూడా ఇప్పుడు పెటాకులు అయ్యింది. ఆ విరహవేదనలో తనది విడాకులు కాదని, బ్రేకప్ లాంటిదని చెప్పిన శ్వేత ఇప్పుడిప్పుడే కెరీర్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్, సినిమాలు చేస్తూ కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటుంది. జాగ్రత్తగా కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటుంది.
తాజాగా ఓ బోల్డ్ రోల్‌లో నటించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఆమె హిందీలో `ఇండియా లాక్‌డౌన్` అనే చిత్రంలో నటిస్తుంది. ప్రముఖ సంచలన దర్శకుడు, జాతీయ అవార్డు చిత్రాల డైరెక్టర్ మధుర్ బండార్కర్ దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శ్వేత సెక్స్ వర్కర్‌గా కనిపించబోతుందట. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ముంబయి రెడ్ లైట్ ఏరియాలోని సెక్స్ వర్కర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుందట శ్వేత. అందుకోసం స్వయంగా ఆమె రెడ్ లైట్ ఏరియాకి వెళ్లింది. ఈ సందర్బంగా శ్వేత బసు ప్రసాద్ చెబుతూ, `నేను, మధు సర్, నా టీమ్.. రెండు వారాల క్రితం కామాటిపుర వెళ్లాం. అక్కడి వారి యాసను బట్టి ఎలా మాట్లాడాలో నేర్చుకున్నా. అక్కడికి వెళ్లడం లైఫ్ టైమ్ ఎక్స్ పీరియెన్స్` అని చెప్పింది శ్వేత.