
మహేష్ ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్ర చేస్తుండగా ఆయనకు తండ్రిగా మలయాళ యాక్టర్ జయరాం నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవల నిలిపివేయబడింది. ఇక తరచు సినిమాలతో పాటు ఎక్కువగా తన సోషల్ మిడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ తన సినిమాలు, అలానే ఫ్యామిలీ కి సంబందించిన విషయాలు వారితో షేర్ చేసుకునే అలవాటు గల సూపర్ స్టార్, క్రికెట్ మ్యాచ్ లు కూడా చూస్తారు ఎంతో ఇష్టంగా అనే విషయం తెలిసిందే.
మరీ ముఖ్యముగా ఇండియా కి సంబందించిన మ్యాచ్ లు ఉంటె మహేష్ బాబు టివి కే పరిమితం అవుతారని పలు సందర్భాల్లో పలువురు నటులు వెల్లడించడం జరిగింది. అసలు విషయం ఏమిటంటే, నేడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా మహేష్ ఆయనకు విషెస్ చెప్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. స్వతహాగా మహేష్ బాబు, సచిన్ టెండ్యూలర్ కి వీరాభిమాని కూడా. క్రికెట్ కి సరికొత్త భాష్యం చెప్పి, ఎంతో గొప్ప పేరు గడించిన సచిన్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానూ అంటూ మహేష్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.....!!