
పూజా హెగ్డే తెలుగుతో పాటు, హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్స్‌తో స్టెప్పులేస్తోంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఐటెమ్ సాంగ్స్‌ని మాత్రం విడిచిపెట్టట్లేదు. 'రంగస్థలం'లో జిగేలురాణిగా మాస్ స్టెప్పులేసిన పూజ, రీసెంట్‌గా 'ఎఫ్-3'లో లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అని డ్యాన్సులు చేసింది. ఇక 'రంగస్థలం'కి 50 లక్షలు తీసుకున్న పూజ, 'ఎఫ్-3' పాటకి కోటి వరకు తీసుకుందని తెలుస్తోంది.
సమంత కెరీర్‌లో ఒకే ఒక్క ఐటెమ్ సాంగ్ చేసింది. 'పుష్ప'లో ఉ.. అంటావా.. ఉఊ అంటావా.. అని కుర్రాళ్ల మతులు పోగొట్టింది. అయితే సామ్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చేసిన ఈ ఐటెమ్ సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా రిలీజైన ప్రతీ భాషలోనూ సమంత సాంగ్‌కి థియేటర్లు డాన్సులు చేశాయి. అయితే ఈ హాట్ ఐటెమ్ సాంగ్‌కి సమంత కోటి వరకు చార్జ్ చేసిందని చెప్తున్నారు.
కాజల్ 'జనతాగ్యారేజ్' తర్వాత మళ్లీ ఐటెమ్ సాంగ్ చేయలేదు. కెరీర్‌లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఐటెమ్ సాంగ్ అని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. జూ.ఎన్టీఆర్ కోసం పక్కా లోకల్ పాట చేశాను గానీ, లేకపోతే చేసేదాన్ని కానని చెప్పింది. అయితే చందమామ ఎంత ఫ్రెండ్‌షిప్ అని చెప్పినా, రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందని, 50 లక్షల వరకు చార్జ్ చేసింది అంటున్నారు సినీ జనాలు.
తమన్న కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పటి నుంచి ఐటెమ్ సాంగ్స్ చేస్తోంది. హీరోయిన్లు ఐటెమ్ సాంగ్స్ చేస్తే కెరీర్‌కి బ్రేకులు పడతాయేమో అనే డౌట్స్ లేకుండా ఐటెమ్ గర్ల్‌గా మారింది. 'అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరు' లాంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. ఈ పాటలకి 40-50 లక్షల వరకు తీసుకున్న మిల్కీ, వరుణ్ తేజ్ 'గని'లో కొడితే అనే స్పెషల్ సాంగ్‌కి 75 లక్షల వరకు చార్జ్ చేసిందట.
'జాతిరత్నాలు' సినిమాతో సూపర్ హిట్ కొట్టింది ఫరియా అబ్దుల్లా. క్యూట్ యాక్టింగ్‌తో రోబో చిట్టి కంటే ఎక్కువ పాపులర్ అయ్యింది. అయితే కెరీర్ బిగినింగ్‌లోనే ఫరియా స్పెషల్ సాంగ్స్ కూడా స్టార్ట్ చేసింది. 'బంగార్రాజు' సినిమాలో వాసివాడి తస్సాదియ్యా అంటూ ఐటెమ్ సాంగ్ చేసింది ఫరియా. ఇక ఈ పాటకి లక్షల్లో వసూల్ చేసిందని తెలుస్తోంది.
రెజీనాకి తెలుగులో 'జ్యో అచ్యుతానంద' తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. జర్నీకి బ్రేకులు పడ్డాయి. హీరోయిన్‌గా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో 'ఎవరు,చక్ర' సినిమాలో విలన్‌గా చేసింది. అయినా బిజీ కాలేదు. ఇక తెలుగు ఆడియన్స్ అంతా మర్చిపోతోన్న సమయంలో 'ఆచార్య'లో సానా కష్టం అనే ఐటెమ్ సాంగ్ చేసింది రెజీనా.