
ఇక ఈ మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ అదిరిపోతుందని, తన కెరీర్ లో ఇప్పటివరకు చేయని రోల్ ఆయన చేస్తున్నారని సమాచారం. థమన్ మరోవైపు ఈ మూవీ కోసం ఆరు అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కూడా ఇటీవల పూర్తి అయిన ఈ మూవీ వాస్తవానికి ఈపాటికే పట్టాలెక్కాల్సింది. అయితే స్క్రిప్ట్ లో కొంత మార్పులు చేయడం కోసం కొంత టైం తీసుకున్నారట త్రివిక్రమ్. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ ఎప్పుడు మొదలవుతుందా, ఆ గుడ్ న్యూస్ గురుజీ ఎప్పుడు చెప్తారా అని మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తుండడంతో, వీలైనంత త్వరలో అనగా, జులై రెండవ వారంలో మూవీ పక్కాగా పట్టాలెక్కనున్నట్లు టాక్. ఇక సినిమాలోని తన పాత్ర కోసం కొంత తన మేకోవర్ లో చేంజెస్ చేస్తున్న మహేష్, తప్పకుండా దీనితో పెద్ద సక్సెస్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ భారీ మూవీని వచ్చే ఏడాదికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశున్న యూనిట్, ఒకవేళ అప్పటికి అనుకున్నట్లుగా పూర్తి కాకపోతే పక్కాగా ఉగాదికి రిలీజ్ చేసేందుకు ఆలోచన చేస్తున్నారట.