
ఇక ఈ సినిమాని జ్యోతిక , సూర్య ఇద్దరు కలిసి 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య చాలా మాసివ్ పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని "అచలుడు" అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. ఈ రోజున డైరెక్టర్ బాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ ను, హీరో సూర్య ప్రీ లుక్ పోస్టర్ని కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. ఇక ఇందులో సూర్య రోలెక్స్ లుక్ లో సీరియస్గా చూస్తున్నట్లుగా ఒక స్టిల్ అదిరిపోయింది అని చెప్పవచ్చు. దీంతో సూర్య అభిమానులు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.
ఈ సినిమా టైటిల్ లుక్ ను విడుదల చేసిన సూర్య ఆసక్తికరమైన క్యాప్షన్ ని జత చేయడం జరిగింది. మీతో మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య అంటూ డైరెక్టర్ బాలాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ కాస్త నెట్టింత వైరల్ గా మారుతున్నది. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ కన్యాకుమారి లో పూర్తి అయినది. ఆ తర్వాత షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేస్తున్నారు.