తెలుగు బుల్లితెర పై స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుదీర్. ఒక సాదాసీదా కమెడియన్గా జబర్దస్త్ లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. పంచులు వేయడంలో కాదు తీసుకోవడంలో కూడా కిక్ ఉంది అంటూ నిరూపించిన సుడిగాలి సుదీర్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కేవలం కామెడీ చేయడమే కాదు డాన్సులతో అదరగొట్టడం.. యాంకరింగ్ తో ఇరగ దీయడం.. మ్యాజిక్ తో ఆశ్చర్య పరచడం చేసి మరింత పాపులారిటీ పొందాడు. ఇక బుల్లితెర తో సరిపెట్టుకోకుండా వెండితెరపై కూడా అరంగేట్రం చేశాడు.


 ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూనే మరోవైపు హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే వేదిక మీద కనిపించిన సుడిగాలి సుదీర్ అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. అయితే సుధీర్ మెయిన్ లీడ్ గా చేస్తున్న చిత్రం వాంటెడ్ పండుగాడ్. రాఘవేంద్ర రావు సమర్పణలో శ్రీధర్ సీపాన రూపొందించారు ఈ సినిమాని. ఇందులో సుధీర్ తో పాటు సునీల్, అనసూయ, దీపికా పిల్లి లాంటివారు ప్రధాన పాత్ర పోషించారు. ఆగస్టు 19 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.


 అయితే ఇక స్టేజి మీద అనసూయ మాట్లాడుతున్నంత సేపు ఎంతోమంది అభిమానులు సుధీర్ అంటూ అరవడం మొదలు పెట్టారు. రాఘవేంద్రరావు మైక్ తీసుకుని సముదాయించేందుకు ప్రయత్నించిన వినలేదు. దీంతో చేసేదేమీలేక సుధీర్ కి మైక్ ఇచ్చేశాడు రాఘవేంద్రరావు. సుధీర్  మైక్ పట్టుకున్నాడో లేదో అక్కడ వేదిక మొత్తం దద్దరిల్లిపోయింది. సుడిగాలి సుదీర్ అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారూ అభిమానులు. అయితే  సుధీర్ కి ఉన్న ఫాలోయింగ్ చూసి రాఘవేంద్రరావు ఒక్కసారి షాక్ అయ్యారు. ఒక బుల్లితెర కమెడియన్ కు ఇంత క్రేజ్ ఉందా అని అనుకున్నారూ అని చెప్పాలి. మీరు ఇలా అరుస్తుంటే ఏం మాట్లాడాలో తెలియక భయంగా ఉంది అంటూ సుడిగాలి సుదీర్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: