
ఇప్పుడు సినిమా నుంచి రెండవ సింగిల్ ని కూడా ఐదు భాషలలో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం డేట్ ఫిక్స్ చేసేది. ఈనెల 25వ తేదీన అంటే ఈరోజు ఈ పాటను రిలీజ్ చేయబోతున్నారు. " ఋషి వనములోన " అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. కన్వ మహర్షి ఆశ్రమ నేపథ్యంలో ఈ పాటలు చిత్రీకరించినట్టుగా మనకు చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. గుణ శేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూనే.. నిర్మిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా సమంత సినీ కెరియర్ లోని ఒక మైలురాయిగా నిలుస్తోందని ఆమె భావిస్తుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారబోతోంది అని కూడా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఇందులో మోహన్ బాబు, గౌతమి, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో వచ్చేనెల అంటే ఫిబ్రవరి 17వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను తెలుగులో ప్రముఖ బడానిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే శివరాత్రి సెలవులను ఉపయోగించుకోవడానికి ఆయన మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా భరతుడి చిన్ననాటి క్యారెక్టర్ పోషిస్తోంది. ఇప్పటికే అల్లు అర్హ కూడా తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.