
‘పెళ్ళి సందడి’ ఫెయిల్యూర్ తరువాత శ్రీలీల రెండు కన్నడ సినిమాలు చేసింది. అయితే అవి కూడ చెప్పుకోతగ్గ విజయాన్ని అందుకోలేదు. గత సంవత్సరం డిసెంబర్ లో ‘ధమాకా’ విడుదలలైన తరువాత ఒక్కసారిగా శ్రీలీల మ్యానియా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఓకె చేసిన సినిమాల లిస్టు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణకు కూతురుగా నటిస్తున్న ఈమె హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో పవన్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది.
మహేష్ త్రివిక్రమ్ ల మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చినా ఆమె వదులుకోలేదు. ఇలా టాప్ హీరోల సినిమాలను కార్నర్ చేస్తూనే యంగ్ హీరోలు రామ్ నితిన్ వైష్ణవ్ తేజ్ నవీన్ పోలిశెట్టి లు నటిస్తున్న సినిమాలలో కూడ ఈమె హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇన్ని సినిమాల మధ్య ఎక్కడా తన డేట్స్ విషయంలో ఎటువంటి తేడా లేకుండా షూటింగ్ స్పాట్ కు వచ్చిన నుండి షూటింగ్ పూర్తి అయ్యేవరకు మంచి జోష్ లో ఉంటూ దర్శకుడు చెప్పిన విధంగా తన పాత్రను చాల సులువుగా సింగిల్ టేక్ తో తన యాక్టింగ్ ను పూర్తి చేస్తున్న ఈమె సమర్థతను చూసి టాప్ దర్శకులు కూడ ఆశ్చర్యపోతున్నారు.
మరొకవైపు టాప్ హీరోయిన్స్ పూజా హెగ్డే రష్మిక లు బాలీవుడ్ లో స్థిరపడటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ సతమవుతున్న పరిస్థితులలో ఈ గ్యాప్ ను శ్రీలీల చాల తెలివిగా ఉపయోగించుకుంటోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..