తమిళ హీరో ధనుష్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందినటువంటి సార్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా విడుదల అయింది. తమిళ్ లో ఈ సినిమా వేత్తి అనే పేరుతో విడుదల అయింది. సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించగా ... జీ వి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించాడు. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా నటించగా ... సముద్ర ఖనిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే 19 రోజులు అవుతుంది. ఈ 19 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సూపర్ కలక్షన్ లభించాయి. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 19 రోజుల్లో దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
తమిళనాడు లో ఈ మూవీ కి 37.40 కోట్ల కలెక్షన్ లు దక్కగా ,  రెండు తెలుగు రాష్ట్రాల్లో 37.22 కోట్లు , కర్ణాటక లో 7.80 కోట్లు , కేరళ లో 1.12 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.15 కోట్లు , ఓవర్సీస్ లో 23.70 కోట్ల కలెక్షన్ లను ఈ మూవీ 19 రోజుల్లో సాధించింది. మొత్తంగా ఈ మూవీ 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 56.33 కోట్ల షేర్ ... 108.39 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు నుండే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 20.33 లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: