త్రివిక్రమ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో నటుడు సునీల్   కూడా ఆయన తో పాటే రూమ్ లో ఉండేవారటా.అలా ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం బాగా ప్రయత్నిస్తూ ఉండేవారు అలా ఇద్దరు కూడా సినిమా అంటే పిచ్చి తో సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ వచ్చిన అవకాశాలని బాగా వాడుకుంటూ ముందుకు దూసుకెళ్లారు.


ముఖ్యంగా త్రివిక్రమ్ రైటర్ గా చేసిన అన్ని సినిమాల్లో సునీల్ కి ఒక మంచి క్యారెక్టర్ ను రాసేవాడు. అందులో భాగం గానే ఆయన మల్లీశ్వరి సినిమా లో చేసిన పద్దు క్యారెక్టర్ ను , అలాగే జల్సా సినిమాలో 10 సెకండ్స్ ముందు ఉండే క్యారెక్టర్ కావచ్చు, అలాగే మన్మధుడు సినిమా లో బంక్ శ్రీను క్యారెక్టర్ కావచ్చు ఇలా త్రివిక్రమ్ రైటర్ గా ఎన్ని సినిమాలు వచ్చిన అన్నిట్లో సునీల్ గారి క్యారెక్టర్ కి ఒక స్పెషలిటీ అయితే ఇస్తూ ఒక స్పెషల్ క్యారెక్టర్ రాస్తూండేవారు అలా వీళ్ల కాంబోలో చాలా సినిమాలు అయితే వచ్చాయి.

ఇక ఇది ఇలా ఉంటె త్రివిక్రమ్ చేసిన సినిమాల్లో సునీల్ చేసిన క్యారెక్టర్స్ ని కనక ఒకసారి చూసుకుంటే మల్లీశ్వరి సినిమాలో సునీల్ క్యారెక్టర్ కి  కాస్త భయం ఎక్కువ గా ఉంటుంది. మన్మధుడు సినిమాలో బంక్ శీను క్యారెక్టర్ కి కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుంది.అలాగే జల్సా సినిమాలో చాలా తొందర ఎక్కువ గా ఉంటుంది ఇలా మూడు సినిమాల్లో మూడు వేరి యేషన్స్ తో కూడిన క్యారెక్టర్స్ ను రాసారు త్రివిక్రమ్, మూడు క్యారెక్టర్స్ లో కూడా అన్ని కూడా ఎక్కువగానే పెట్టి రాసాడు... అలా ఎందుకు రాసారు అంటే సునీల్ ఏదైనా చాలా ఈజీ గా చేయగలడటా కాబట్టి ఆయన కోసం స్పెషల్ గా క్యారెక్టర్ రాయడం చాలా కష్టం అయిందని అప్పటికి సునీల్ అన్ని రకాల కామెడీ క్యారెక్టర్స్ కూడా చేసాడు ఇక ఇవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని అలా రాసాను అది సక్సెస్ అయింది అంటూ త్రివిక్రమ్ ఒక వేడుక లో చెప్పారటా..

మరింత సమాచారం తెలుసుకోండి: