తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వేట్రి మారన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో మూవీ లతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అద్భుతమైన క్రేజ్ ను తమిళ సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ దర్శకుడు తాజాగా తమిళ్ లో విడుతలై పార్ట్ 1 అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. 

మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళం భాషలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయినా మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి తమిళ్ వర్షన్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇలా ఈ మూవీ తమిళ భాషలో అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ని తెలుగు భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు లో విడుదల పేరుతో విడుదల చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని అల్లు అరవింద్ తెలుగు లో విడుదల చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ 8 వ తేదీన ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో కమెడియన్ సూరి హీరోగా నటించగా ... విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: