రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "కే జి ఎఫ్" మూవీ తో దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను దర్శకుడిగా సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అద్భుతమైన క్రేజ్ ఉన్న ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండడం ... "కే జి ఎఫ్" లాంటి భారీ విజయవంతమైన సినిమా తర్వాత ప్రశాంత్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో సలార్ మూవీ పై దేశ వ్యాప్తంగా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని ఇంగ్లీష్ భాషలో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడినప్పటికీ ఈ మూవీ నుండి కొంత మంది నటీనటులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను మినహాయిస్తే ఈ సినిమా నుండి ఎలాంటి ఇతర అప్డేట్ లను ఈ చిత్ర బృందం విడుదల చేయలేదు.

 ఈ మూవీ యొక్క టీజర్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క టీజర్ ను జూన్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమరన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. రవి బుసృర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: