
ప్రస్తుతం బాలీవుడ్ లో కూడ సినిమాలు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమంత లేటెస్ట్ గా ఒక డాక్టర్ కు పెళ్ళి సంబంధాలు వెతికే విషయంలో చాల బిజీగా ఉంది. ఈ విషయాన్ని సమంత లేటెస్ట్ గా తన ఇన్ ష్టా గ్రామ్ లో తెలియచేసింది. బాలీవుడ్ సెలబ్రిటీ డాక్టర్ గా పేరుగాంచిన జ్యూవెల్ గమాడియాకు సూటబుల్ మ్యాచ్ కావాలని సమంత అన్వేషణ చేస్తోంది. అతడు చాల మంచి వాడని అతడు బయట కనిపించే దానికన్నా చాల తెలివైన వాడని అతడి మంచితనం గురించి తాను హామీ ఇస్తున్నానని సమంత హామీ సర్టిఫికేట్ ఇస్తోంది
సోషల్ మీడియాలో సమంత పెట్టిన ఈ పోష్టు చూసి చాలామంది షాక్ అవుతున్నారు. దీనితో అసలు ఈ డాక్టర్ జ్యువెల్ ఎవరు అంటూ గూగుల్ సెర్చ్ చేసారు. అనుష్క శర్మ నుంచి కత్రినా కైఫ్ వరకు అజయ్ దేవగన్ నుంచి బాలీవుడ్ ప్రముఖుల అందరికీ గో టు డాక్టర్ గా డాక్టర్ జ్యూవెల్ వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాడట. ఇతడు సెలబ్రిటీలకు వెస్ట్రన్ ఆక్యుంపక్చర్ ఉపయోగించి చికిత్స చేస్తూ ఉంటాడట. మరి ఇతడికి సరైన అమ్మాయిని ఎంతవరకు సమంత చూడగలుగుతుందో చూడాలి.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే లేటెస్ట్ గా విడుదలైన ‘ఖుషీ’ మూవీలోని పాటకు మంచి స్పందన రావడంతో ఈ మూవీతో తిరిగి సమంత హవా ప్రారంభం అయ్యే ఆస్కారం కనిపిస్తోంది అంటు ఆమె అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు..