ఈ మధ్యకాలంలో సుకుమార్ శిష్యులందరూ కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ముందుగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఆ తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు గురువులకు ఏమాత్రం తక్కువ కామని నిరూపించారు.ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో తెలుగు దర్శకుడిగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ ఓదెలకి మంచి గుర్తింపు లభించింది. నాని కీర్తి సురేష్ కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఇక ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగానే వస్తువులను రాబట్టింది. ఈ సినిమా హిట్టవడంతో తన నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేస్తారని అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో సైలెంట్ గా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక శ్రీకాంత్ ఓదెల ఎవరిని వివాహం చేసుకున్నాడు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తన సొంత ఊరైన గోదావరిఖని కరీంనగర్ జిల్లాలో ఆయన వివాహం చాలా సైలెంట్ గా జరిగింది .ఇక ఆయన వివాహానికి గాను సుకుమార్ దంపతులతో పాటు సుకుమార్ శిష్యులు అందరూ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన ఏ సినిమా చేయడం లేదని ప్రస్తుతం ఆయన పుష్ప 2  షూటింగ్ లో సుకుమార్ కి సహకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఆయన పెళ్లి చేసుకోవడంతో పుష్ప 2 సినిమా షూటింగ్ కి కూడా కాస్త బ్రేక్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఈ వార్త విన్నం వారందరూ ఆయన వివాహం చేసుకున్న యువతి గురించి అరా తీస్తున్నారు. కానీ ఆయన పెళ్లి చేసుకున్న యువతి గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఇదిలా ఉంటే ఇక శ్రీకాంత్ ఓదెలా నెక్స్ట్ సినిమా అఖిల్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: